Telugu News

దేశంలో విజృంభిస్తోన్న కరోనా

== భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

0

దేశంలో విజృంభిస్తోన్న కరోనా
== భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
== దేశవ్యాప్తంగా 2,38,018 కేసులు నమోదు
== గత 24 గంటల్లో స్వల్పంగా తగ్గుదల
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్‌ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీగా నమోదవుతున్న కేసులకు కాస్త బ్రేక్‌ పడిరది. దేశవ్యాప్తంగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా సోమవారం 310 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. కేసులు మరణాలు కాస్త తగ్గాయి. 20,071 కేసులు తగ్గాయి.

also read :-కూసుమంచిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగు తోంది. ప్రస్తుతం 19.65 శాతం నుంచి 14.43 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా కరోనా నుంచి 1,57,421 మంది బాధితులు కోలుకు న్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,54,947,882 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94 శాతంగా ఉంది.

also read:-కూసుమంచిలో హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంపీపీ

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 158.04 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 80 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.