Telugu News

మొదటి టీ20లో ఓడిన భారత్

నాలుగు వికేట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా

0

మొదటి టీ20లో ఓడిన భారత్

== నాలుగు వికేట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా

== దంచికొట్టిన గ్రీన్..వెడ్

== ఐదు మ్యాచ్ ల ఈ టోర్నిలో 0-1తో ముందున్న ఆస్ట్రేలియా

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

భారత్ తన విన్నింగ్ చాన్స్ ను చేజేతులా వదులుకుంది.. డ్రాఫ్ క్యాచ్.. మిస్స్ పీల్డ్ లతో టీమీండియా ఘోర పరాజయం పాలైంది.. అత్యధిక పరుగులు చేసినప్పటికి ఆస్ట్రేలియా చేతిలో నాలుగు వికేట్ల తేడాతో ఓటమిపాలైంది.. ఆస్ట్రేలియా బ్యాట్సెమెన్ గ్రీన్, వెడ్ దంచికొట్టారు.. భారత్ బోలర్లను ఆడేసుకున్నారు.. టీమీండియా బోలర్ భువనేశ్వర్ ఘోరంగా పరుగులిచ్చాడు.

allso read- టీమీండియా 208 రన్స్ తో భారీస్కోర్

నాలుగు ఓవర్లకు 52 పరుగలివ్వగా అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లేసి 17 పరుగలిచ్చి మూడు వికేట్లను పడగొట్టాడు. ఆయనకు తోడుగా ఉమేష్ మరో రెండు వికేట్లను పడగొట్టాడు. కానీ మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న ఆస్ట్రేలియా టీమ్  బౌలింగ్ విషయంలో కొంత తడబడిందనే చెప్పాలి. కెఎల్ రాహుల్, పాండ్యా ఆఫ్ సెంచరీలతో అద్భుతమైన ఇన్నింగ్ ఆడటంతో భారత్ 20 ఓవర్లకు గాను 6 వికేట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపనర్లు ఫించ్, గ్రీన్ మొదటి నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశారు. మొదటి బంతిన సిక్సర్ గా మార్చిన ఆస్ట్రేలియా బ్యాట్సిమెన్ మొదటి ఓపనింగ్ బ్యాట్సమెన్ అద్భుతంగా రాణించారు. అయితే ఫించ్ 22(13బంతుల్లో) అక్షర్ పటేల్ కు చిక్కి పెవిలియన్ దారిపట్టాడు. వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ 30(24బంతుల్లో) దాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తరువాత మ్యాక్స్ వెల్ 1 పరుగుకే పెవిలియన్ దారి పట్టగా, ఇంగ్లీస్ 17, డేవిడ్ 18 పెవిలియన్ చేరారు. దీంతో క్రిజ్లో పాతుకపోయిన గ్రీన్61(30 బంతుల్లో) అక్షరపటేల్ కు చిక్కాడు. ఆ తరువాత  రంగంలోకి వచ్చిన వేడ్ నిలకడగా అడుతూ అందినప్పుడళ్లా సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 21 బంతుల్లో 45 పరుగులు చేసిన వేడ్ ఆస్ట్రేలియా విజయాన్ని అందించాడు. అయితే భారత ఫీల్డర్లు మాత్రం ఈ రోజు చెత్త ఫీల్డింగ్ చేశారనే చెప్పాలి. మూడు క్యాచ్ లను జారవిడిచారు. అదే ఇండియా ఓటమికి ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు. వేడ్,  మొత్తానికి టీమీండియాపై ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ ను దక్కించుకుంది.. ఇక చూడాలి రాబోయే రోజుల్లో టీమీండియా ఏ విధంగా ముందుకు సాగుతుందో..?

allso read- సూదిగాళ్ళు చిక్కారా..?