Telugu News

టీమీండియా 208 రన్స్ తో భారీస్కోర్

ఆస్ట్రేలియా టార్గెట్ 209 రన్స్

0

ఆస్ట్రేలియా టార్గెట్ 209 రన్స్

== భారీ స్కోర్ చేసిన భారత్ క్రికెట్ టీమ్

== ప్రారంభమైన టీ20 రెండవ ఇన్నింగ్స్

(క్రీడావిభాగం- విజయంన్యూస్)

ఇండియా క్రికెట్ టీమ్ భారీగా స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 208 రన్స్  చేసి ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. భారత్ వేదికగా ఇండియావర్సెస్ ఆస్ట్రేలియా ఐదు టీ20 మ్యాచ్ ల క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. మొదటిగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బొలింగ్ ను వేంచుకుంది. పేవరేట్ గా బరిలోకి దిగిన రోహిత్ సేన ప్రారంభంలోనే వికేట్లు పడినప్పటి భారీ స్కోర్ చేసింది.

allso read- పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపనింగ్ బ్యాటింగ్ దిగినప్పటి ప్రారంభం సరిగ్గా స్కోర్ రాలేదు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ 9బంతుల్లో 11 రన్స్ తో  హేజిల్ ఉడ్ బోలింగ్ లో ఇల్లిస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. వెను వెంటనే వనడౌన్ గా వచ్చిన కోహ్లి 7బంతుల్లో 2 పరుగులు చేసి వెనుదిరిగారు. కాగా క్రిజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 46(25) కెఎల్ రాహుల్ తో జత కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారి ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. దీంతో భారత్ స్కోర్ భారీ స్కోర్ దిశగా అడుగుల వేసింది. అయితే ఇంతలో గ్రీన్ వేసిన బంతికి వేడ్ కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ పెవిలియన్ కు చేరాడు. దీంతో రంగంలోకి వచ్చిన హార్థిక్ పాండ్య తన ప్రతాపాన్ని చూపించాడు. 30 బంతుల్లో 71 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించాడు. వెంటవెంటనే కెఎల్ రాహుల్ 35బంతుల్లో 55, అక్షర్ పటేల్ 5బంతుల్లో 6 పరుగులుతో పెవిలియన్ చేరుతున్నప్పటికి హార్థిక్ పాండ్య మాత్రం బ్యాంటింగ్ దూకుడులో వెనకడుగు వేయలేదు.. సిక్స్ లు, పోర్లతో విరుచకపడ్డాడు. 236.7 స్ట్రయిక్ రేట్ తో 7 పోర్లు 5 సిక్సర్లతో భారీ స్కోర్ చేశాడు. అనంతరం కార్తిక్ 5బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా, హర్థక్ పటేల్ క్రిజ్ లోకి వచ్చి హర్థిక్ పాండ్యకు అండగా నిలవడంతో టీమీండియా  6 వికేట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బోలర్లలో హేజిల్ ఉడ్ 4ఓవర్లకు 39 పరుగులిచ్చి 2 వికేట్లు తీయగా, ఇల్లిస్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికేట్లను తీశాడు.

allso read- టెన్షన్ ఎందుకు దండగా…! పొంగులేటి అండ ఉండగా…!!