మృత్యువులోను వీడని బంధం*
ఒక రోజు వ్యవధిలో తల్లి,కొడుకు మృతి
కోలంగూడలో విషాదం
సిర్పూర్(యు), కెరమెరి-(విజయం న్యూస్)
మృత్యువు లోను పేగు బంధం వీడలేదు.అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో మరుసటి రోజు అదే సమయానికి కుమారుడు కూడా మృతి చెందిన హృదయవిదారకమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవపూర్ గ్రామ పంచాయతీ పరిసిలోని కోలాం గూడకు చెందిన సిడాం అ య్యు బాయి (59) అను వృద్ధురాలు అస్తమాతో బాధపడుతుంది.
దీంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు చికిత్స పొంది జైనూర్ మండలంలోని గౌరి గ్రామంలో ని బంధువుల ఇంటికి తీసుకొచ్చారు.పరిస్థితి విషమించి బుదవారం అయ్యుబాయి మృతిచెందడంతో అంత్యక్రియల నిమిత్తం సాయంత్రం స్వగ్రామమైన కోలాంగూడకు మృతదేహాన్ని తరలించారు. అప్పటికే చీకటి పడడంతో అంత్యక్రియలు గురువారం చేయుటకు నిర్ణయించారు. అప్పటికే గత కొన్నేళ్ళుగా పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమైన కుమారుడు కర్ణు(44) సైతం తల్లి చనిపోయిన సమయానికే మృతి చెందడంతో గిరిజన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అయ్యుబాయి భర్త రెండు నెలల క్రితం మృతి చెందగా ,కర్ను భార్య లక్ష్మీ బాయి ఏడాది క్రితమే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఏడాదిలో ఇంట్లోని పెద్దలు నలుగురు మృతి చెందడంతో ఇళ్ళు మొత్తం ఖాళీ అయింది.దీంతో కర్ణు కుమారులు బాలు(23) మారుతి (21) పిల్లలు మాత్రమే ఉన్నారు.తల్లి, కుమారుడి అంత్యక్రియలు గ్రామస్తులు ఒకే సారి నిర్వహించగా చూపరులను కంటతడి పెట్టించాయి.బాధిత కుటుంబాన్ని కో లాం సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సిడాం ధర్ము పరామర్శించారు.
అనాదలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలి
కోలాం సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిడాం ధర్ము
ఏడాది కాలంలో అనారోగ్యంతో అమ్మ, నాన్నతో పాటు తాతయ్య, నానమ్మ కూడా చనిపో
అనాదలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలి*
కోలాం సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిడాం ధర్ము
ఏడాది కాలంలో అనారోగ్యంతో అమ్మ, నాన్నతో పాటు తాతయ్య, నానమ్మ కూడా చనిపోయారు. దీంతో ఆ కుటుంబం వీధిపాలైంది.ఒకరి తర్వాత ఒకరు నలుగురు మృతి చెందడంతో వారి కుమారులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.
also read :- బాధిత మహిళలకు మేము అండగా ఉంటాం దిశ మహిళా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్