డిప్యూటీ తహసీల్దార్ సూసైడ్.
(కర్నూలు జిల్లా ప్రతినిధి – విజయంన్యూస్): –
కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని రాంభూపాల్ రెడ్డి నగర్లో ఉంటున్న డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా సురేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. మృతుని భార్య జగదీశ్వరి కోవెలకుంట్ల స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సురేంద్ర ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు….
also read :- వరంగల్‌కు వచ్చే ఏడాది నుంచి విమానాలు తిరగాలి..