Telugu News

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఇంజనీర్. 

క్షేమంగా విడుదల.

0

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఇంజనీర్. 

క్షేమంగా విడుదల.

(భద్రాచలం ప్రతినిధి – విజయంన్యూస్) :-

భద్రాచలం, మావోయిస్టుల వద్ద ఆరు రోజులు బందీగా ఉన్న సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను మావోయిస్టులు 7వరోజు బుధవారం క్షేమంగా విడిచిపెట్టారు. పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్ళిన అజయ్ లక్రా, గుమస్తా లక్ష్మణ్‌లను గత గురువారం మావోయిస్టులు అదుపులోకి తీసుకొన్నారు. లక్ష్మణ్‌ని మరునాడు విడిచిపెట్టిన మావోయిస్టులు అజయ్‌ని తమవద్ద బందీగా ఉంచుకున్నారు.

ఆయన విడుదల కోసం అజయ్ లక్రా భార్య అర్పిత చంకన మూడేళ్ళ బాలుడితో కాలినడకన ఆదివాసీ సమాజ్ నేతల సహకారంతో అడవిబాట పట్టారు.
అజయ్ లక్రా ఆచూకీ కోసం అడవి అంతా తిరిగారు. ఎట్టకేలకు మావోయిస్టులను కలిసి మొరబెట్టుకున్నారు. మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి మీడియా ప్రతినిథులు, ఆదివాసీ సమాజ పెద్దల సమక్షంలో అజయ్ లక్రాను క్షేమంగా విడుదల చేశారు. ఇలా కిడ్నాప్ కథ సుఖాంతమవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు, ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

also read :- రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నది.