Telugu News

అమరావతిలో ఉత్కంఠ

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కోసం విద్యార్థుల ఆందోళన

0

అమరావతిలో ఉత్కంఠ
== జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కోసం విద్యార్థుల ఆందోళన
== విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
== విద్యార్థి సంఘాల అరెస్ట్‌లపై సిపిఎం మండిపాటు
(అమరావతి-విజయంన్యూస్):-
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద తలపెట్టిన ధర్నాకు పోలీసుల అనుమతి లేదంటూ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హావిూలను ఏపీ సీఎం జగన్‌ నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఖాళీగా ఉన్న 2లక్షల 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

also read :-కాలేజీలుగా 119 బీసీ గురుకులాలు

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడిరచారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరని వారు అన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయితే ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళనలను అడ్డుకోవడానికి విద్యార్థులను, యువజన సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఖండిరచారు. అలాగే ఈ సందర్భంగా అరెస్టయిన వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

please subscribe this chanel  smiling chaithu