Telugu News

చెలరేగిన రోహిత్ శర్మ..అద్భుత సెంచరీ

మూడేళ్ల తరువాత సెంచరీ చేసిన రోహిత్

0

చెలరేగిన రోహిత్ శర్మ..అద్భుత సెంచరీ

== మూడేళ్ల తరువాత సెంచరీ చేసిన రోహిత్

== న్యూజిలాండ్‌పై 83 బంతుల్లో సెంచరీ

(క్రీడావిభాగం-విజయంన్యూస్)

రోహిత్ శర్మ విరగదీశాడు.. చాలా ఏళ్ల తరువాత రోహిత్ శర్మ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఓపెనర్ శుభమన్ గిల్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేయడంతో తొలిభాగస్వామం 220 పరుగులు చేశారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 83 బంతుల్లోనే రోహిత్‌ శర్మ శతకాన్ని నమోదు చేశాడు. చివరి సారిగా రోహిత్‌ శర్మ 2020లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జనవరి 19న ఆస్టేల్రియా విూద సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు సెంచరీ చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉండటం విశేషం. వన్డేల్లో రోహిత్‌ శర్మకు ఇది 30వ సెంచరీ. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో  రికీ పాంటింగ్‌ (30)తో కలిసి రోహిత్‌ శర్మ సమంగా మూడో స్థానంలో నిలిచాడు. పాంటింగ్‌ 365 ఇన్నింగ్స్‌ లో 30 సెంచరీలు కొడితే రోహిత్‌ కేవలం 234 ఇన్నింగ్స్‌ లోనే 30వ సెంచరీ చేయడం విశేషం. అటు  చివరి వన్డేలో గిల్‌, రోహిత్‌ కలిసి 212 పరుగులు ఓపెనింగ్‌ పాట్నర్‌ షిప్‌ను నమోదు చేశారు.  న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

ఇది కూడా చదవండి: ఇండోర్‌లో పరుగుల వరద