ఇండోర్‌లో పరుగుల వరద
== దంచికొట్టిన టీమిండియా.. భారీ స్కోర్
== సెంచరీలతో చేలరేగిన రోహిత్,గిల్
== చివరిలో ఆప్ సెంచరితో ఆదుకున్న పాండ్యా
== న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిన బ్యాటర్లు
== 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోర్
(క్రీడా విభాగం-విజయంన్యూస్):
ఇండోర్ స్టేడియంలో పరుగుల వరద పారింది.. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ చెలరేగిపోవడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.. 50 ఓవర్లలో 385 పరుగులు సాధించింది.. ఓపెనర్లు ఇద్దరు డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేస్తుండగా బంతి బౌన్స్ లేకపోవడంతో పెవిలియన్ కు చేరినప్పటికి చివర్లో వైస్ కెప్టెన్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఆప్ సెంచరీ చేసి భారీ స్కోర్ ను భారత్ కు అందించాడు. దీంతో న్యూజిలాండ్ పై భారత్ క్లిన్ స్వీప్ చేసింది. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో చెలరేగి ఆడిరది. భారీ స్కోరు చేసి సవాల్ విసిరింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. టాస్ గెల్చిన న్యూజిలాండ్ భారత్‌కు బ్యాటింగ్‌ఇచ్చింది.
ఇది కూడా చదవండి :డబుల్ సాధించడంలో గిల్ ఐదవ ఆటగాడు..
దీంతో మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెలరేగి ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరి శతకాలకు తోడు చివరిలో హార్ధిక పాండ్యా 54 పరుగులు జోడిరచడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు నమోదు చేసింది. దీంతో ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే గత రెండు వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అంచనాలకు తగ్గట్టు రాణించలేక పోయారు. దీంతో ఇప్పటికే 2`0 తేడాతో సిరీస్‌ను కోల్పోయారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ మరోసారి చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. అయితే సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మిచెల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (101) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక వ్యక్తిగత స్కోరు 112 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 36 పరుగులు వద్ద ఔటయ్యి కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 17 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే చివరిలో హార్ధిక పాండ్యా(54), శార్ధూల్ ఠాకూర్ (25) చెలరేగి ఆడి జట్టు స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరూ ఔటయ్యాక చివరి రెండు ఓవర్లలో తక్కువ పరుగులే వచ్చాయి. వాషింగ్టన్ సుందర్(9), కుల్దీప్ యాదవ్(2,రనౌట్), ఉమ్రాన్ మాలిక్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, బ్లయిర్ టిక్నర్ చెరో 3 వికెట్లు తీయగా..
ఇది కూడా చదవండి: దంచికొట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్
మిచెల్ బ్రేస్‌వెల్ 1 వికెట్ తీశాడు. మిగతా 2 వికెట్ల రనౌట్ రూపంలో దక్కాయి. కివీస్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్ మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రోహిత్, గిల్ జోరు చూస్తుంటే భారత్ 400 రన్స్ చేస్తుందని అనిపించింది. కానీ, వాళ్లిద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చి న కోహ్లీ (35), ఇషాన్, సూర్య విఫలమయ్యారు. జాకబ్ డఫీ కోహ్లీ, సూర్య వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. కివీస్ బౌలర్లలో టిక్నర్, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు తీశారు. బ్రేస్‌వెల్‌కు ఒక వికెట్ దక్కింది.