Telugu News

మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి.

యాక్సిడెంట్ లో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు.

0

మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి.
– యాక్సిడెంట్ లో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు.

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పలువురిని తన కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తద్వారా వారికి సకాలంలో వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కొణిజర్ల సెంటర్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

తన పర్యటన ముగించుకొని ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి మధ్యమార్గంలో రోడ్డు ప్రమాద ఘటనను గమనించి తన కాన్వాయ్ ని ఆపేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

also read :- ఉద్యమకారుడు.. బీసీ నేత.. ఆర్థికంగా బలవంతుడు.