Telugu News

నా లవ్‌ ప్రపోజ్‌ను ఆ అమ్మాయి రిజెక్ట్‌ చేసింది

గబ్బర్‌ సింగ్‌ ఫన్నీ కామెంట్స్‌

0

నా లవ్‌ ప్రపోజ్‌ను ఆ అమ్మాయి రిజెక్ట్‌ చేసింది

== గబ్బర్‌ సింగ్‌ ఫన్నీ కామెంట్స్‌

(ముంబై-విజయంన్యూస్);-
టీమిండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అభిమానులను సంతోష పరచడంలో ముందుంటాడు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్‌ సినిమా డైలాగ్స్‌, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. ధావన్‌కు టీమిండియా గబ్బర్‌ అని ముద్దుపేరు ఉంది. టీమిండియా ఓపెనర్‌గా మంచి పేరు సంపాదించిన శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గబ్బర్‌ రెండు మ్యాచ్‌ల్లో 92 పరుగులు చేశాడు. ఈనెల 8న బ్రబౌర్న్‌ వేదికగా ఢల్లీి క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు పంజాబ్‌ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో ధావన్‌ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

also read :-కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

అయితే అందులో ఒకటి మాత్రం బాగా పేలింది. క్రికెట్‌ ఆడుతున్న కొత్తలో ఒక అమ్మాయి ధావన్‌ లవ్‌ ప్రపోజల్‌ను రిజెక్ట్‌ చేసిన విషయాన్ని పేర్కొన్నాడు. అవి నేను క్రికెట్‌లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో ఒక అమ్మాయి బాగా నచ్చి ప్రపోజ్‌ చేశాను. ఆమె నన్ను రిజెక్ట్‌ చేసింది. కారణం.. నేను అప్పట్లో కాస్త నల్లగా ఉండేవాడిని..అంతే కాదు నా ముఖంపై మచ్చలు ఉండడంతో నా లవ్‌ను రిజెక్ట్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను ఇచ్చిన కౌంటర్‌ సమాధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు కోహినూర్‌ డైమండ్‌ను రిజెక్ట్‌ చేశావు.. ఇలాంటివాడు నీకు మళ్లీ దొరక్కపోవచ్చు.. అంటూ ముసిముసిగా నవ్వాడు. ఈ వీడియోనూ పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.