Telugu News

తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ముగ్గురికీ గాయాలు

అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢికొట్టిన కారు.. కారులో చెలరేగిన మంటలు

0

తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ముగ్గురికీ గాయాలు

అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢికొట్టిన కారు..

కారులో చెలరేగిన మంటలు

 

(తిరుపతి – విజయం న్యూస్)  : –  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ని ఢీ కొనడంతో కార్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానికులు తక్షణమే వారిని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

మృతులలో చిన్నారి కూడా ఉంది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

also read :- దర్గాలో ప్రార్థనలు చేసిన – ఈటేల

also read :- కమలం గూటికి మల్లన్న : **** ముహుర్తం ఖారారు..