Telugu News

చెరువులో పడి తాత, కొడుకు, మనుమడు మృతి

చిన్న గురిజాల గ్రామంలో విషాదం...

0

చెరువులో పడి తాత, కొడుకు, మనుమడు మృతి
== బాలుడితో సహా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కన్నీరుమున్నీరైన గ్రామస్తులు.
== వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
== చిన్న గురిజాల గ్రామంలో విషాదం…
(వరంగల్ ప్రతినిధి-విజయంన్యూస్)
నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు ఒకే కుటుంబానికి చెందిన తాత, కొడుకు,మనవుడు మృతి చెందంతో గ్రామస్తులందరు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ శివారులోని చెరువు వద్దకు తాత క్రిష్ణమూర్తి, కొడుకు నాగరాజు, మనవడు లక్కిలు ముగ్గురు కలిసి వెళ్లారు. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మనవుడు చెరువులో పడిపోవడంతో తండ్రి కాపాడేందుకు ప్రయత్నించి అందులో దూకగా, ఇద్దర్ని కాపాడేందుకు ప్రయత్నించి తాతా చెరువులో మునిగి అక్కడిక్కడే చనిపోయారు. స్థానికులు వారిని చూసి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది.

also read :-ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్, అజయ్

అప్పటికే వారు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నేలకొంది. మూడు తరాలకు చెందిన తాత క్రిష్ణమూర్తి, కొడుకు నాగరాజు, మనువడు లక్కీ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారు మృతి చెందిన సగతి తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని తప్పకుండా అదుకుంటామని, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తానని హామినిచ్చారు. అకాలంగా మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.