Telugu News

హై స్పీడ్ ఓవర్ లోడ్ తో వస్తున్న కంకర లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన సిర్పూర్ టీ గ్రామస్తుల

సిర్పూర్ టి// విజయం న్యూస్

0

హై స్పీడ్ ఓవర్ లోడ్ తో వస్తున్న కంకర లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన సిర్పూర్ టీ గ్రామస్తుల

(సిర్పూర్ టి// విజయం న్యూస్)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గంలోని సిర్పూర్ టీ మండల కేంద్రంలోని డౌనల్ ఏరియా ప్రాంతంలో  హై స్పీడ్ ఓవర్ లోడ్ తో కంకర నింపుకొని విపరీతమైన దుమ్ము దులుపుతూ వస్తున్న లారీలను సిర్పూర్ టీ గ్రామస్తులు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. యువకులు మాట్లాడుతూ ప్రతిరోజు వందల కొద్దిగా లారీలు దుమ్ము దులుపుతూ రోడ్డు పై కంకర పడేస్తూ వస్తున్నందున వాహనదారులకు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడంతో దుమ్ము వలన శ్వాసకోస సంబంధించిన వ్యాధులు వ్యాపించి అనారోగ్యం పాలు  అవుతున్నామని తెలిపారు.

అలాగే ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అందువలన ఈరోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఓవర్లోడ్ హై స్పీడ్ తో కంకర నింపుకొని వస్తున్న లారీలు రోడ్డుపై వాటరింగ్ చేసి సాయంత్రం 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కంకర లారీలు నడుపు కోవాలని డిమాండ్ చేశారు. అలా నడుపు కుంటే ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. సిర్పూర్ టీ మండల తాసిల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్పందించి హై స్పీడ్ ఓవర్ లోడ్ తో కంకర నింపుకొని వస్తున్న లారీ యజమానులపై డ్రైవర్లపై చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను జరగకుండా ప్రజలు మరియు మండలంలోని పాఠశాల లా విద్యార్థిని విద్యార్థులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా  రక్షించవలసిన బాధ్యత వారిపై ఉండని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిర్పూర్ టీ స్పందించి సిర్పూర్ టీ మండల ప్రజల వాహనదారుల విద్యార్థిని విద్యార్థులకు హాని జరగకుండా అతి త్వరలోనే మీయొక్క డిమాండ్ నెరవేర్చి సహకరిస్తామని హామీ ఇవ్వడంతో అడ్డుకున్న ఓవర్ లోడ్ కంకర లారీలను వదిలిపెట్టారు. ఓవర్ లోడ్ హై స్పీడ్ తో కంకర నింపుకొని వస్తున్నా లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన వారిలో యువకులు వార్డ్ మెంబర్ మూఇజ్, సయ్యద్ అమీన్ సిర్పూర్ టీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

also read ;- ఉద్యమాల పురిటిగడ్డ… చిన్న గూడూరు.