Telugu News

నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం

బరిలో 16 జట్లు

0

నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం

== బరిలో 16 జట్లు

== బరిలో తొలి రౌండ్లో ఎనిమిది దేశాలు

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

పొట్టి ప్రపంచకప్ సమయం రానే వచ్చింది.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న క్రీడాకారులు, క్రికెట్ అభిమానుల కల నేరవెరనుంది.. షెడ్యూల్ ప్రకారం2020 సంవత్సరంలో ఈ టోర్ని జరగాల్సి ఉండగా కరోనా కరాణంగా రెండేళ్ల పాటు వాయిదపడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ప్రపంచకప్ క్రికెట్ టోర్నికి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఆ సమయం గంటల వ్యవధిలోనే ఉంది.. నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.. మొత్తం ఈ టోర్ని బరిలో 16 దేశాలకు సంబంధించిన జట్లు బరిలో నిలవనున్నాయి. అందులో 8జట్లు సూపర్ 12 లో చోటు కోసం తొలి రౌండ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. రోజుకు మూడు మ్యాచ్ ల చొప్పున జరగనున్నాయి. 14 రోజుల పాటు రెండేసి మ్యాచ్ ల నిర్వహించనున్నారు. ఏ రెండు మ్యాచ్ లు ఒకే సారి జరగవు. వచ్చేనెల 13 వరకు ఈ క్రికెట్ టోర్ని జరగనుంది.. 13న పైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.   ప్రపంచకప్ ఆరంభం రోజు మొదటి రోజున శ్రీలంక-నమీబియా, యూఏఈ-నేదర్లాండ్స్  జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. కాగా ఈ ప్రపంచకప్ హాట్ పేవరేట్ గా ఐదు దేశాలు బరిలోకి వస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ధక్షణాప్రికా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజలాండ్ జట్లు కప్ బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ టోర్ని మొత్తం ఆస్ట్రేలియాలో జరగనుంది. ప్రపంచకప్ చరిత్రలోనే మొదటి సారి అతిథ్యమిస్తోంది. గతంలో 1992, 2015 వన్డే ప్రపంచకప్ టోర్నిమెంట్స్ జరిగాయి..

allso read- గుర్రంపై వచ్చి ఆ పని చేసిన యువకుడు