Telugu News

కెనెడాలో ఘోరరోడ్డు ప్రమాదం

= ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

0

కెనెడాలో ఘోరరోడ్డు ప్రమాదం
== ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
కెనడాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు చనిపోయారు. టొరంటో సవిూపంలో హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు కెనడాలోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా వెల్లడిరచారు. విద్యార్థుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధితుల స్నేహితులను సంప్రదించి అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామన్నారు. మార్చి 13న జరిగిన ఈ యాక్సిడెంట్‌లో మరో ఇద్దరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అజయ్‌ తెలిపారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థుల సహా మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్‌ బైసారియా వెల్లడిరచారు.

also read;-ఓటమికి సోనియా ఒక్కరినే బాధ్యులను చేయలేం

బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాగా మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌, జస్పిందర్‌ సింగ్‌, కరన్‌పాల్‌ సింగ్‌, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌ కుమార్‌గా గుర్తించామని కెనడాలోని పోలీసులు వెల్లడిరచారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ వ్యాన్‌ శనివారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు.