తమిళనాడులో కుప్పకూలిన హెలికాప్టర్
== చీఫ్ ఆఫ్ డిపెన్స్ బిపిన్ రావత్ తో పాటు మరో ఆరుగురు మరణం
== శకటాలను గుర్తించిన భారత సైన్యం
(చెన్నై-విజయంన్యూస్)
తమిళనాడు రాష్ట్రంలో జవానతమిళనాడులోని కూనూరు అటవీప్రాంతలో బిపిన్‌రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న ఎంఐ-17 చాపర్ అకస్మాత్తుగా చెట్లపై కూలిపోయింది. ఈ క్రమంలో హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరి కొందరు అధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో నలుగురు మరణించినట్లు తెలిసింది. బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉన్నట్లు తెలిసింది. 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్.హెలికాప్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు బ్రిగేడియర్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్ఓలు గురుసేవక్ సింగ్, జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ్, సత్పాల్ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంపై వాయుసేన తక్షణ విచారణకు ఆదేశించింది.
ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్లు ఉన్నాయి.– జాబితాను విడుదల చేసిన ఆర్మీ చీఫ్ డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్(IAF MI-17V5) ప్రమాదానికి గురైన సంఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధృవీకరించింది. అందులో ప్రయాణిస్తున్న వారి జాబితాను రిలీజ్ చేసింది. ప్రయాణికుల్లో.. బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్వోలు గుర్సేవక్ సింగ్, జితేందర్ కుమార్, వివేక్ కుమార్, సాయి తేజ, సత్పాల్ ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఎయిర్‌ఫోర్స్ ఆదేశించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తమిళనాడు ఫారెస్ట్ మినిష్టర్ రామచంద్రన్ ప్రకటించారు. అయితే.. బిపిన్ రావత్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
also read :- ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించండి.