టాస్ గెలిచిన భారత్..
== టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
== ప్రారంభమైన ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్
(క్రీడావిభాగం-విజయంన్యూస్)
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. నాగపూర్ వేదికగా గురువారం క్రికెట్ టోర్నమెంట్ లో ఇండియా, ఆస్ట్రేలియా రెండవ టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా కోట్లాధి మంది అబిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమవుతోంది. వర్షం కారణంగా ఎంపైర్లు ఆలస్యంగా మ్యాచ్ ను ప్రారంభించారు.
ALLSO READ- త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?
ఇండియా కెప్టన్, ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ వద్దకు రాగా భారత్ టీమ్ టాస్ గెలిసి మొదటిగా బౌలింగ్ వెంచుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ మొదటి మ్యాచ్ ఓటమి తరువాత కసితో వస్తున్నామని, కచ్చితంగా ఈ మ్యాచ్ విన్నింగ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆస్ట్రేలియా కేప్టెన్ మాట్లాడుతూ మొదటి మ్యాచ్ విజయంతో మరింత జోష్ తో ఉన్నామని, రెండవ మ్యాచ్ గెలిచి పట్టు సాధించాలని అనుకుంటున్నామని తెలిపాడు. ఇండియాను అంత ఈజీగా తీసుకోబోమని తెలిపారు. ఇండియా మొదటి టీ20 4 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. కాగా టీమీండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ ఫామ్ ను కొనసాగించాలని భావిస్తోంది… అయితే గతంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇందులో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఇదే వేదికలో ఆస్ట్రేలియా పై భారత్ 7మ్యాచ్‌లు గెలిచింది. కాగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
== ప్లేయర్స్ భారీగా మార్పు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే టీ20 రెండవ మ్యాచ్ లో భారత్ కీలక ఆటగాడు, వికేట్ కీపర్ రిషబ్ పంత్ ను మరోసారి తీసుకోవడం జరిగింది. అలాగే మొదటి మ్యాచ్ లో ఘోరంగా పరులిచ్చిన భువనేశ్వరకుమార్ ను తప్పించారు. ఈ మ్యాచ్ లోనైనా భారత్ విజయం సాధిస్తుందో…? లేదో..? చూడాలి.
ALLSO READ- ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?