నేడు పాక్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ
== చాలా రోజుల తరువాత మైదానంలోకి
== ఆసక్తి కామెంట్ చేసిన మాజీ ఇండియా కెప్టెన్
క్రీడా విభాగం, ఆగస్ట్28(విజయంన్యూస్):
విరాట్ కోహ్లీ.. ఆయన భారత క్రికెట్ మ్యాచ్ కే దిగ్గజం.. ఆయన బ్యాట్ పడితే పరుగుల వరదే.. టీమ్ ఎలాంటి సమయాల్లో ఉన్నప్పటికి ఆయన బ్యాట్ తో పరుగుల వరద కురిపిస్తూ విజయతీరాలకు చేర్చిన మ్యాచ్ లను అనేకంగానే ఉన్నాయి.. కష్టసమయంలో టీమ్ కు అండగా నిలబడి తోటి బ్యాట్స్ మెన్ కు భరోసానిచ్చి విజయం సాధించే వరకు పోరాటం చేసే మంచి ఇండియన్ క్రికెటర్. ఎన్నో సెంచరీలు.. ఎన్నో ట్ర్యాక్ రికార్డ్ లు.. అలాంటి విరాట్ కోహ్లీ ఈ మధ్య మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తరువాత కోహ్లీ ఆటలో మార్పులు వచ్చాయి..
allso read- నేడు భారత్,పాక్ క్రికెట్ మ్యాచ్
సెంచరీ చేయక ఎన్ని రోజులైందో..? అందుకే ఎన్నో టోర్నిలకు ఆయన్ను విశ్రాంతిపేరుతో పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే చాలా సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో ఆడబోతున్నాడు. 2019లో చివరి సెంచరీ చేసిన కోహ్లీ..ఆ తర్వాత ఫాం లేమితో తంటాలు పడ్డాడు. చివరకు కెప్టెన్సీ కోల్పోయాడు. ఆడపాదడపా మ్యాచులు ఆడినా పెద్దగా రాణించలేదు. దీంతో ఇంగ్లండ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌ల్లోనూ కోహ్లీ ఆడలేదు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఫ్రాన్స్‌లో గడిపాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ లో పాక్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. అయితే చాల రోజుల తర్వాత బ్యాట్ పట్టబోతున్న కోహ్లీ..ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. తన 14 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇన్ని రోజుల పాటు బ్యాట్ పట్టకపోవడం ఇదే తొలిసారి అని కోహ్లీ చెప్పాడు. ఆటకు దూరంగా ఉండటం పిచ్చెక్కిస్తుందని, ఈ విషయంలో మానసికంగా తాను కుంగిపోయానన్నాడు. నెలరోజులు ఆటకు దూరంగా ఉన్నందుకు సిగ్గుగా లేదన్నాడు. తాను ఏ పని చేసినా వివేకంతో చేస్తానని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఎల్లప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడతానన్నాడు. మైదానంలోనూ దూకుడుగా ఉంటానని తెలిపాడు. అయితే అలా ఎలా సాధ్యమంటూ చాలా మంది ప్రశ్నిస్తారని..ఆటపై ప్రేమతోనే అని వారికి సమాధానం చెప్పేవాడినన్నాడు. ఏ మ్యాచ్ ఆడినా..జట్టుకు మేలు జరగాలని భావిస్తానని కోహ్లీ అన్నాడు. అందుకే మైదానంలో రాణించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. కొన్ని రోజులుగా తన సామర్థ్యానికి తగినట్టుగా ఆడటం లేదని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. పైకి తాను మానసికంగా ధృడంగా కనిపించినా.. ప్రతీ ఒక్కరికి పరిమితులు ఉంటాయని, వాటిని గుర్తించాలన్నాడు. లేదంటే పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చని..అందుకే రెస్ట్ తీసుకున్నా అని కోహ్లీ పేర్కొన్నాడు.
allso read- నేడు కానిస్టెబుళ్ల ప్రిలిమినరీ రాతపరీక్ష్