టాస్ విన్ బై ఇండియా
== ప్రారంభమైన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్
== టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న రోహిత్ శర్మ
(క్రీడావిభాగం-విజయంన్యూస్)
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ టీ20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా శనివారం ప్రారంభమైన ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్ లో రెండవ రోజు ఆదివారం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా కోట్లాధి మంది అబిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఇండియా కెప్టన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ కెప్టెన్ ఉమర్ టాస్ వద్దకు రాగా ఇండియా టీమ్ టాస్ గెలిసింది. కాగా రోహిత్ శర్మ మొదటిగా బౌలింగ్ వెంచుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసియాకప్ టోర్నమెంట్ కోసం ఇండియా టీమ్ పేవరేట్ గా బరిలో దిగుతుందని, ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్నామని తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్నామని, కచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు. కచ్చితంగా ఈ మ్యాచ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చూస్తారని అన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఉమర్ మాట్లాడుతూ ఇండియాపై విజయం సాధించడమే లక్ష్యంగా గేమ్ ప్లాన్ తో వెళ్తున్నామని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగానే ఉన్నామని అన్నారు. ముందుగా మంచి స్కోర్ చేయడం వల్ల ఆ తరువాత భారీ స్కోర్ పెరిగే అవకాశం ఉందన్నారు. చూద్దాం ఏ టీమ్ విజయం సాధిస్తుందో..?
allso read- నేడు పాక్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ