Telugu News

పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం

ఉత్కంఠ నడుమ సిక్స్ తో విజయతీరాలకు చేర్చిన హర్థిక్ పాండ్య

0

పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం

== ఉత్కంఠ నడుమ సిక్స్ తో విజయతీరాలకు చేర్చిన హర్థిక్ పాండ్య

== బెస్ట్ పాట్నరసిఫ్ గా జడేజా, పాండ్య

== ఆసియాకఫ్ లో బోణి చేసిన భారత్

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

భారత్ ఘన విజయం సాధించింది. చిరకాల శత్రువుగా భావించే పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠలో భారీ సిక్స్ కొట్టి కూల్ కూల్ గా మ్యాచ్ ను ముగించేశాడు హార్థిక్ పాండ్య. ముఖ్యంగా జడేజా, పాండ్యా భాగస్వామ్యం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. త్వరత్వరగా ఇండియా వికెట్లు పడిపోతున్న సమయంలో నాల్గొవ బ్యాట్సమెన్ గా వచ్చిన జడేజ నిలకడగా రాణించాడు. ఆయనకు తోడుగా బెస్ట్ ఆల్ రౌండర్ గా మంచి ఫామ్ లో ఉన్న హర్థిక్ పాండ్య33(17) జడేజాకు తోడుగా ఉంటూ అడపదడపా చాట్స్ అడుతూ భారత్ ను ఉత్కంఠ నుంచి బయటపడేశారు. నాలుగు ఓవర్లకు 44 పరుగులు చేయాల్సిన దశలో ఇద్దరు కలిసి అద్భుత షాట్స్ తో అలరించి 6 పరుగులకు 7 రన్స్ కు తీసుకొచ్చారు. అయితే చివరి ఓవర్ లెగ్ స్పిన్నర్ కు ఇవ్వడంతో వెంటనే ముగిద్దామని ఆవేశ పడిన జడేజా లెగ్ స్పిన్నర్ మాయకు క్లిన్ బోల్డ్ అయ్యాడు. దీంతో మళ్లీ ఉత్కంఠకు దారితీసింది.

allso read- ఇండియా టార్గెట్ 148

3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన సమయంలో కూల్ కూల్ సిక్స్ కొట్టి ఇండియాను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించేలా చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో క్రిడెట్ మొత్తం పాండ్య కొట్టేశాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రోహిత్ శర్మ(12)కు జోడీగా కెఎల్ రాహుల్ రాగా మొదటి రెండవ బంతికే కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వనడౌన్ లో వచ్చిన కోహ్లీ 35(34) నిలబడే విధంగా అడినప్పటికి నవాజ్ బొలింగ్ లో ఇస్తికర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆయన తరువాత వచ్చిన జడేజా35(29) నిలకడగా రాణిస్తూ వికెట్ కాపాడుకున్నాడు. కానీ ఆటువైపు ఎండ్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 18(18) వెనువెంటనే నజీమ్ బోలింగ్ లో వికెట్ పారేసుకుని పెవిలియన్ కు దారిపట్టాడు. అయితే జడేజా, పాండ్యా జాగ్రత్తగా అడుతూ జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. మొత్తానికి ఉత్కంఠగా సాగిన  ఈ పోరులో రోహిత్ సేన అద్భుత విజయం సాధించి భారత అభిమానులకు మంచి శుభవార్తను అందించారు. ఇక పాకిస్తాన్ బోలర్లో నసీమ్ షా అద్భుతమైన ఫామ్ ను కనబర్చాడు. ఆయన 4ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకుని పరుగులను కట్టడి చేశారు. అలాగే మహ్మద్ నవాజ్ 3.4 ఓవర్లు వేసి 33 రన్స్ చ్చి 3 వికెట్లు పడగొట్టి ఇండియా టీమ్ కు గట్టి పైట్ ను ఇచ్చారు. దీంతో ఇండియా ఆసియా కప్ టోర్నిలో మొదటి విజయం సాధించింది.