Telugu News

టాస్ గెలిచిన శ్రీలంక.. బొలింగ్ పస్ట్

ప్రారంభమైన ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్

0

టాస్ గెలిచిన శ్రీలంక

== ప్రారంభమైన ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్

== టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న శ్రీలంక కెప్టెన్

(క్రీడావిభాగం-విజయంన్యూస్)

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా, శ్రీలంక టీ20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది.  దుబాయ్ వేదికగా మంగళవారం ప్రారంభమైన  ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఇండియా, శ్రీలంక మ్యాచ్ ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా కోట్లాధి మంది అబిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ప్రారంభమైంది.  ఇండియా కెప్టన్ రోహిత్ శర్మ, శ్రీలంక కెప్టెన్ దసుస్ షనక టాస్ వద్దకు రాగా  శ్రీలంక టీమ్ టాస్ గెలిసి మొదటిగా బౌలింగ్ వెంచుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసియాకప్ టోర్నమెంట్ లో మొన్న పాకిస్తాన్ పై ఓటమి తరువాత కసితో వస్తున్నామని, కచ్చితంగా ఈ మ్యాచ్ విన్నింగ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి : చండ్రుగొండలో ‘హరితహారం’ ఆగం.. మాగం..

ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. 2022 ఆసియా కప్‌లో సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి చెందింది.  కాగా టీమీండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి  మళ్లీ ఫామ్ ను కొనసాగించాలని భావిస్తోంది… అయితే గతంలో జరిగిన భారత్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇందులో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. శ్రీలంకపై భారత్ 17 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టీ20 ఆసియా కప్ 2016లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

== మ్యాచ్ కు దూరమైన ఆల్ రౌండర్ జడేజా

ఇండియా, శ్రీలంక మధ్య మంగళవారం జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత్ కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈటోర్నికి దూరమైయ్యాడు. గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ తో పాటు టోర్నికి దూరం కావడం వల్ల ఆయన స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే జడేజా లేకపోవడం భారత్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే..?

== మూడవ స్థానంలో ఇండియా

ఆసియా కప్ 2022 సూపర్ ఫోర్ పాయింట్ల పట్టికలో భారత్ వెనకబడి ఉంది. మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ పై ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఆగ్రస్థానంలో శ్రీలంక ఉండటం, ఆ టీమ్ పై ఈ రోజు మ్యాచ్ జరగడం అసక్తిగా మారింది.  అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

ఇరుజట్ల ఇలా

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్) కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అక్షరపటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

 

శ్రీలంక : దసుస్ షనక(కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక