Telugu News

నేడు భారత్‌,పాక్‌ క్రికెట్ మ్యాచ్‌

దుబాయి వేదికగా ఆసియా కప్ పోరు

0

నేడు భారత్‌,పాక్‌ క్రికెట్ మ్యాచ్‌

== దుబాయి వేదికగా ఆసియా కప్ పోరు

== ఆసక్తిగా మారి భారత్,పాక్ పోరు

== హాట్ పేవరేట్ గా బరిలో దిగుతున్న ఇండియా

== మ్యాచ్ ను తిలకించనున్న కోట్లాది మంది ప్రేక్షకులు

క్రీడావిభాగం,ఆగస్ట్‌28(విజయంన్యూస్):

క్రికెట్ అంటేనే మస్తు మజా.. అందులో భారత్, పాక్ మ్యాచ్ అంటే.. అబ్బో.. యావత్తు ప్రపంచం ఎదురుచూసే క్షణం రానే వచ్చింది.. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్‌` పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది.. నేడు దాయుదాల పోరు కొనసాగనుంది..రెండు దేశాల నడుమ సాగే ఈ పోరు క్రికెట్ గానే చూడరు..ఆ దేశపౌరులంతా మా దేశం గెలవాలని ప్రార్థనలు చేస్తారు.. వారి పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంటారు..  ఎన్నో ఏళ్ల తరువాత జరిగి ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: పునాదుల్లోనే (పురిటి) నొప్పులు…

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.. ప్రతి ఐదేళ్లకొకసారి జరిగే ఈ ఆసియా కప్ భారత్ పేవరేట్ గా బరిలో దిగుతుంది.. ఆసియాకప్ లో ట్రాక్ రికార్డ్ భారత్ కే అధికంగా ఉంది. ఈ సారి కూడా ఆసియాకప్ ను ముద్దాడాలని యావత్తు భారత్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే శనివారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో శ్రీలంక వర్సెస్ అప్ఘానిస్తాన్ మొదటి మ్యాచ్ లో పోటీ పడగా, రెండవ మ్యాచ్ గా ఇండియా, పాకిస్తాన్ పోటీపడనున్నాయి. దుబాయి వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు యావత్తు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరు ఉత్కంఠగా చూస్తున్నారు. కాగా చివరిసారి ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో పోటీ పడగా.. భారత్‌ ఓటమిపాలైంది. ఈ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్‌ బలంగా భావిస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. అటు ప్రత్యర్థి పాక్‌ కూడా భారత్‌పై నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది.

==భారత్ పేవరేట్

ఆసియాకప్ లో భారత్ పేవరేట్ గా బరిలో దిగబోతుంది. ఎన్నో ఆసియా కప్ లను ముద్దాడిన ఇండియా క్రికెట్ టీమ్ ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ ను కూడా ముద్దాడాలని భావిస్తుంది. అందుకు గాను కోచ్ రవిశాస్త్రి నాయకత్వంలో పటిష్టమైన భారత్ టీమ్ ను ఆసియాకప్ కు ఎంపిక చేసి దుబాయ్ కి పంపించారు. అందరు యంగ్ అండ్ డైనమిక్ క్రికెట్ టీమ్ బరిలో దిగనుంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌లతో కూడిన భారత బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. గాయాలతో ఇరుజట్లలో ప్రధాన పేసర్లు టోర్నీకి దూరం కావడంతో.. రెండు జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా టీమిండియా యార్కర్‌ కింగ్‌ జస్పీత్‌ బుమ్రా.. పక్కటెముకల గాయం కారణంగా హర్షల్‌ పటేల్‌ ఆడకపోవడం భారత్‌కు కష్టంగా మారింది. దీంతో పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ మోయనున్నాడు. భువీకి తోడుగా అర్ష్‌దీప్‌ సింగ్‌ను బరిలోకి దించాలని యాజమాన్యం భావిస్తోంది. భారత టాప్‌ ఆర్డర్‌ శుభారంభం ఇస్తే.. మిడిలార్డర్‌ భారీస్కోరు చేయాలని జట్టు యోచిస్తోంది. 10 నుంచి 20 ఓవర్ల మధ్య సూర్యకుమార్‌, హార్దిక్‌ చెలరేగితే చివర్లో దినేశ్‌ కార్తీక్‌ మెరుపులు మెరిపిస్తే గెలుపు నల్లేరు విూద నడకే అని రోహిత్‌ సేన భావిస్తోంది.

ఇది కూడ చదవండి: తిరుపతిలో మంత్రి పువ్వాడ అజయ్ కు ఘన స్వాగతం

== గెలుపే లక్ష్యంగా పాక్ అడుగులు

పాకిస్తాన్ జట్టు కూడా ఆసియాకప్ లో ఇండియాపై విజయం సాధించేందుకు తహతహలాడుతోంది. గతంలో జరిగిన ఆసియా కప్ వేదికలో ఏనాడు ఇండియాపై విజయం సాధించలేదు. గత టీ20 వరల్డ్ కప్ లో ఇండియాపై విజయం సాధించి మంచి పట్టుమీద ఉన్న పాక్,  ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఇండియాపై విజయం సాధించాలని ఆ దేశ పౌరులందరు ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ టీమ్ కూడా అందుకు తగ్గట్లుగానే వ్యూహాం పన్నుతుంది. పాక్‌ జట్టులోనూ బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫకర్‌ జమాన్‌లతో కూడిన బ్యాటింగ్‌ బలంగానే ఉంది. అంతర్జాతీయ టోర్నీలలో పాక్‌పై ఎప్పుడూ భారత్‌ పైచేయి సాధించడం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు, మోకాలి గాయంతో షాహీన్‌ అఫ్రిదీ దూరం కావడం వల్ల పాక్‌కు గట్టి దెబ్బ తగిలింది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న పాకిస్థాన్‌ బలమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఎదుర్కొనేందుకు బంతితో ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనేది కీలకంగా మారింది. గతేడాది బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ రాణించడం వల్ల భారత్‌పై 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ గెలవడం ఆ జట్టుకు విజయంపై ఆశలు కల్పిస్తోంది.

== భారీగా టిక్కెట్ల విక్రయాలు

దుబాయ్‌ వేదికగా భారత్‌`పాక్‌ మధ్య ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీరాభిమానులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌`2022 టోర్నీ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేయనుంది. మొబైల్‌లో వీక్షించేందుకు వీలుగా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. అయితే, ఈ రెండు మాధ్యమాల్లో మ్యాచ్‌లు చూడాలంటే తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మెగా టోర్నీ మ్యాచ్‌లను టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటున్న దేశీవాసులకు మాత్రం ఓ గుడ్‌న్యూస్‌! అదేమిటంటే.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్‌ ఆధ్వర్యంలోని డీడీ స్పోర్ట్స్‌, డీడీ ఫ్రీడిష్‌లో ఉచితంగా మ్యాచ్‌లు

ఇది కూడా చదవండి: నేడు కానిస్టెబుళ్ల ప్రిలిమినరీ రాతపరీక్ష్

చూడవచ్చు.  కాగా దూరదర్శన్‌లో ఆసియా కప్‌ ప్రసారాలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా ఇండియా` పాకిస్తాన్‌ మ్యాచ్‌ చూసే అవకాశం.. భలే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్‌ టోర్నీ జరుగనుంది. ఇక అత్యధిక ఆసియా కప్‌ టైటిళ్లు గెలిచిన, డిఫెండిరగ్‌ చాంపియన్‌ టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది.