Telugu News

దంచికొట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్ 

డబుల్‌ సెంచరీతో నిలబెట్టిన శుభమన్‌ గిల్‌

0

దంచికొట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్

== 8 వికెట్లకు 349 పరుగుల స్కోరు

== డబుల్‌ సెంచరీతో నిలబెట్టిన శుభమన్‌ గిల్‌

== ఛేదనలో తడబ్బ కివీస్‌ బ్యాటర్లు

హైదరాబాద్‌,జనవరి18(విజయంన్యూస్):

భారత్ ఆటగాళ్లు దంచికొట్టారు.. ఎంత అంటే మాముళుగా కాదు.. అందిన బాల్ ను అందినట్లే బౌండరికి పంపించారు. ఇక గిల్ అయితే జిగెల్ అనేలా చేశాడు.. డబుల్ సెంచరితో అద్భుతం చేశాడు.   350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ జట్టు ఛేదనలో తడబడిరది. సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్‌ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. అంతకుముందు కివీస్‌ ఓపెనర్లు తడబడ్డారు. ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే (10) పరుగులకే సిరాజ్‌ బౌలింగ్‌ లో వెనుదిరగగా, దూకుడగా ఆడిన మరో  ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (40) కూడా త్వరగానే ఔటయ్యాడు.

ఇది కూడా చదవండి: గిల్‌ జిల్ జిగేల్

ఆ తరువాత కాసేపటికే హెన్రీ నికోల్స్‌ (18), హెన్రీ నికోల్స్‌ (18), ª`లగెన్‌ ఫిలిప్స్‌ (11) వెనువెంటనే ఔటయ్యిరు. టార్గెట్‌ ఛేదనలో కివీస్‌  సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిరది. ప్పల్‌ వన్డే మ్యాచ్‌ లో టీమిండియా ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌  శుభ్‌మన్‌ గిల్‌  రెచ్చిపోయి ఆడాడు. క్రీజ్‌ లోకి వచ్చిన గిల్‌..  చివరి వరకు క్రీజ్లో ఉండి ఏకంగా డబుల్‌ సెంచరీ బాదాడు. వరుసగా బౌండరీలు బాదుతూ కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  145 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసిన గిల్‌..  డబుల్‌ సెంచరీకి ముందు మూడు

సిక్సర్లు బాదాడు. గిల్‌ ఇన్నింగ్స్‌ లో మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లున్నాయి. గిల్‌ కు ఇదే ఫస్ట్‌ డబుల్‌ సెంచరీ కాగా ఇండియా తరుపున  డబుల్‌ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. పెర్గుసన్‌ వేసిన 48.1 ఓవర్లో మొదటి మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన గిల్‌ 200 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో గిల్‌ కి ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌. ఆల్‌ రౌండర్‌ షార్దూల్‌ ఠాకూర్‌ రన్‌ ఔట్‌ అయ్యాడు. ఫెర్గుసన్‌ వేసిన 46.4 బంతిని కవర్‌ డ్రైవ్‌ ఆడిన గిల్‌ రన్‌ కి ప్రయత్నిస్తాడు. చురుకుగా స్పందిచిన సాంట్నర్‌ లాథమ్‌ కి బాల్‌ అందించడంతో షార్దూల్‌ రన్‌ ఓట్‌ అవుతాడు. శుభ్‌ మన్‌ గిల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో నిలబడటంతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి దాటిగా ఆడిన గిల్‌ కు భారత  బ్యాటర్ల  సపోర్ట్‌  లభించలేదు. అయినా, వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌ బౌలర్లకు ఎదురుకున్నాడు.

ఇది కూడా చదవండి: ‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం

ఆల్‌ రౌండర్‌ వాషింగ్‌ టన్‌ సుందర్‌ శుభ్‌మన్‌ తో కలిసి వికెట్ల పతనాన్ని ఆపుతాడనుకుంటే తక్కువ పరుగులకే (12) వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 44.6 ఓవర్‌ వద్ద షిప్లే బౌలింగ్‌ లో ఎల్‌ బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. ఇకపోతే వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 28 పరుగులకే వెనుదిరిగాడు. మిచెల్‌ వేసిన 39.4 ఓవర్లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హార్దిక్‌ ఉన్నంతసేపు గిల్‌ కి సపోర్ట్‌ గా నిలబడ్డాడు. సెంచరీ చేసి ఊపు విూదున్న గిల్‌ క్యాచ్‌ ని డ్రాప్‌ చేశారు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు. షిప్లీ వేసిన 37.3 ఓవర్లో నేరుగా బౌలర్‌ కి క్యాచ్‌ ఇచ్చాడు. షిప్లీ వైపు దూసుకొస్తున్న బంతి ఎడమ చేత్తో క్యాచ్‌ అందుకోబోయాడు. కానీ, బాల్‌ బొటన వేలికి తాకి నేలపాలయ్యింది. దాంతో ఊపిరిపీల్చుకున్న గిల్‌, తరువాత బంతిని బౌండరీ పంపించాడు. శుభ్‌మన్‌ గిల్‌ 87 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో14  ఫోర్లు, ఓ సిక్సు ఉంది. గిల్‌ కు ఇది వన్డేలో మూడో సెంచరీ కాగా స్వదేశంలో రెండవది. 106 పరుగుల వద్ద టిక్నర్‌ బౌలింగ్‌ లో ఫోర్‌ కొట్టిన గిల్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. గిల్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ భారీ స్కోర్‌ సాధిస్తాడనుకున్న సూర్య 31 పరుగుల వద్ద విూడియం ఫేసర్‌ మిచల్‌ బౌలింగ్‌ లో సాంటర్న్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో 65 పరుగుల భాగస్వామ్యానికి తెర పడిరది. సూర్య ఉన్నంతసేపు స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెట్టింది. ఉప్పల్‌ వన్డేలో టీమిండియా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.