ఇషాన్ ఉతికేసిండూ..డబుల్ సెంచరీ చేసిన ఇషాన్
== 210 స్కోర్ తో సచిన్ చెంతకు చేరిన భారత్ బ్యాట్స్ మెన్
== సెంచరితో కదం తొక్కిన కోహ్లి
== బంగ్లాపై భారీ స్కోర్..
(క్రీడావిభాగం-విజయంన్యూస్)
భారత్ క్రికెట్ టీమ్ మరో భారీ స్కోర్ చేసింది..వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భారీ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.. 409 భారీ స్కోర్ తో ఆల్ టైమ్ రికార్డ్ ను మరోసారి సొంతం చేసుకుంది. అంతే కాకుండా యువ స్టార్ ఇషాన్ కిషన్ బాల్ ను ఉతికేసిండూ.. పోర్లు, సిక్స్ లతో విరుచకపడ్డాడు. దీంతో వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్స్ లిస్ట్ లో ఇషాన్ చేరిపోయాడు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సెంచరీతో అకట్టుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 409 పరుగులు చేసి బంగ్లాదేశ్ కు 410 పరుగుల టార్గెట్ ను ముందుంచుంది.
ఇది కూడ చదవండి: హిమాచల్ లో పై ‘చెయ్యి’
పూర్తి వివరాల్లోకి వెళ్తే భారత్, బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు జరగ్గా, ఆ రెండు మ్యాచ్ లను బంగ్లాదేశ్ గెలుచుకుని సీరిస్ ను కైవసం చేసుకుంది. కాగా శనివారం మూడవ మ్యాచ్ కోసం రంగంలోకి దిగిన ఇరు జట్లు ముందుగా భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను వెంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన ఓపెనర్లు త్వరగా వికేట్లను కోల్పోగా, ఆ తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ బంగ్లా బోలర్లను ఓ ఆట అడేసుకున్నాడు. 131 బంతుల్లో 21 పోర్లు, 11 సిక్స్ లతో 210 పరుగులుతో వీరా విహారం చేశాడు. దీంతో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ, వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండులూకర్ సరసన చేరారు. అతి తక్కువ కాలంలోనే వన్డే కేరరీలో డబుల్ సెంచరీ చేసిన ఘనత సాధించారు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లకు గాను 8 వికెట్లను నష్టపోయి 409 పరుగులు చేసింది.