Telugu News

జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం.

శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

0

జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం.

శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

(విజయం న్యూస్):-

ఈ ఎన్‌కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ యాసిర్ పర్రేను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇతను ఐఈడీ బాంబుల స్పెషలిస్ట్ అని పోలీసులు తెలిపారు.

జమ్మూ-కశ్మీరు పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ఏరియాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ఈ ఎన్‌కౌంటర్లో జేఈఎం కమాండర్ యాసిర్ పర్రేతోపాటు మరో ఉగ్రవాది ఫుర్ఖాన్‌ను మట్టుబెట్టారు.

ఫుర్ఖాన్ విదేశీ ఉగ్రవాది అని వెల్లడైంది. వీరిద్దరూ అనేక ఉగ్రవాద నేరాల్లో నిందితులని కశ్మీర్ ఐజీపీ మీడియాకు తెలిపారు.

also read :- సిరివెన్నెల మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు : సీఎం కేసీఆర్‌