రెండవ వన్డేకు సిద్దమైన కివిస్, ఇండియా
== నేడు రాయ్‌పూర్ వేదికగా మ్యాచ్
== గెలిచేందుకు ఇరు జట్ల సరికొత్త వ్యూహాలు
(క్రీడా విభాగం-విజయంన్యూస్)
కివీస్ తో రెండవ వన్డేకు సిద్దమైయింది టీమీండియా.. హైదరాబాద్ కేంద్రంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో విజయంతో నూతన ఉత్తేజంలో ఉన్న టీమీండియా రెండో వన్డేకు సర్వం సిద్దమైంది. మూడు వన్డే మ్యాచ్ టోర్నమెంట్ ను ఈ మ్యాచ్ గెలిచి కౌవసం చేసుకోవాలని చూస్తోంది. ఉప్పల్ విజయంతో మరితం ఉత్సాహంగా రెండో వన్డేలోనూ గెలిచేందుకు రోహిత్ సేన రంగంలోకి దిగబోతోంది. శనివారం రాయపూర్ వేదికగా రెండో వన్డేకు ఇరు జట్లు రంగంలోకి దిగబోతున్నాయి.
ఇది కూడా చదవండి: దంచికొట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్
తృటిలో విజయం చేజార్జుకున్న న్యూజిలాండ్ జట్టు విజయం కోసం పట్టుదలగా ఉంది. చివరి నిముషంలో విజయాన్ని తృటిలో చేజార్జుకుంది. అయితే తొలివన్డేలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని రోహిత్ సేన ముందుకు సాగాల్సి ఉంది. ఇకపోతే రాయ్‌పూర్‌లో అడుగుపెట్టిన రోహిత్ సేనకు ఘన స్వాగతం దక్కింది. భారతదేశంలో క్రికెట్ ని ఎంతలా ఆరాధిస్తారో అందికీ తెలుసు. మ్యాచ్ టీవీల్లో వస్తుందంటేనే వదిలిపెట్టరు అలాంటిది.. ప్లేయర్లంతా తమ ఊరికి వచ్చి ఆడుతుంటే ఊరుకుంటారా..! ఊరంతా పండగ జరుపుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచే ప్లేయర్లకి స్వాగతం పలుకుతారు. అలాంటి ఘటనే రాయ్ పూర్లో జరిగింది. న్యూజిలాండ్ తో జరగబోయే రెండవ వన్డేకోసం టీమిండియా రాయ్ పూర్ చేరుకుంది. దాంతో తమ అభిమాన క్రికెటర్లని చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ కి పోటెత్తారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్స్ కి వెళ్లే రోడ్లన్నీ ఫ్యాన్స్ తో సందడిగా కనిపించాయి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది శాలువాలు కప్పి ప్లేయర్లను ఆహ్వానించారు. తర్వాత ఛత్తీస్ గఢ్ ట్రెడిషనల్ డాన్స్ సూవా , పంతీ చేస్తూ వెల్ కం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియాను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇరు జట్ల మధ్య రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగనుంది.
ఇది కూడా చదవండి: గిల్ జిల్ జిగేల్