Telugu News

కోహ్లీ డ్యాన్స్‌

== ఊ అంటావా..? పాటకు స్టేప్పులేసిన కోహ్లి

0

కోహ్లీ డ్యాన్స్‌

== ఊ అంటావా..? పాటకు స్టేప్పులేసిన కోహ్లి

== మాక్స్‌వెల్‌ వెడ్డింగ్‌ పార్టీలో కోహ్లీ డ్యాన్స్‌

(ముంబయి-విజయం న్యూస్);-

ఊ అంటావా..? మామ..ఊహుం అంటావా.. మామ అంటూ సాగే సిని సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మనందరకి తెలిసిందే.. ఆ పాటకు టీమీండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టేప్పులేశారు…ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడిచినా.. విరాట్‌ కోహ్లీ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటీ రాలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే ఔటై.. లేని నవ్వుని ముఖంపై తెచ్చుకుని కోహ్లీ పెవిలియన్‌కి వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. అయితే.. గుజరాత్‌తో మ్యాచ్‌ ముంగిట? ఐపీఎల్‌ 2022 సీజన్‌లో పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న విరాట్‌ కోహ్లీ.. మైదానం వెలుపల మాత్రం మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు.

also read :-అక్రమ వెంచర్లపై చర్యలు తప్పవు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ పవర్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బుధవారం రాత్రి ఇచ్చిన వెడ్డింగ్‌ పార్టీకి హాజరైన విరాట్‌ కోహ్లీ.. సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా.. ఊఊ అంటావా’ పాటకి స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షబాజ్‌ అహ్మద్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ హుషారుగా స్టెప్‌లు వేశాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌.. ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అలానే విరాట్‌ కోహ్లీ ఈ 9 మ్యాచ్‌ల్లో కలిపి చేసింది 128 పరుగులేకాగా.. ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లు కూడా ఉన్నాయి. కోహ్లీ నెం.3లో విఫలమవుతుండటంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అతడ్ని ఓపెనర్‌గా బెంగళూరు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పంపింది.

also read :-ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ నియామకం

కానీ.. ఓపెనర్‌గా కూడా కోహ్లీ ఫెయిలై 9 పరుగుల వద్దే ఔటయ్యాడు. బెంగళూరు టీమ్‌ తన తర్వాత మ్యాచ్‌ని గుజరాత్‌ టైటాన్స్‌తో శనివారం మధ్యాహ్నం బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ఆడనుంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన గుజరాత్‌ టీమ్‌ ఏకంగా 7 మ్యాచ్‌ల్లో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఇక గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తమిళనాడుకి చెందిన వినీ రామన్‌ని మార్చి 27న వివాహం చేసుకోగా.. అతను లేట్‌గా ఐపీఎల్‌ 2022 సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సహచర క్రికెటర్లకి వెడ్డింగ్‌ పార్టీ ఇచ్చాడు.