Telugu News

***పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ఇచ్చోడ విజయం న్యూస్

0

***పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

***(ఇచ్చోడ విజయం న్యూస్);-

క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని కోందరు వారి కుటుంబ సభ్యులకు క్షోభని మిగులుస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబం సభ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇచ్చోడ మండలం నావేగాం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నావేగాం గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి కూతురు మమతకు కొన్ని రోజులు క్రితం నిశ్చితార్థం అయింది.

alo read :-*రైతులను ఆదుకోవాలి: కిసాన్ కాంగ్రెస్

అయితే మమతకు ఈ సంబంధం ఇష్టంలేక పలుసార్లు కుటుంబ సభ్యులతో గొడవ పడింది కాగా గురువారం రోజు కూడా పెళ్లి వద్దని తల్లిదండ్రులతో గొడవ పడింది. ఎంత చెప్పినా ఇంట్లో వారు ఒప్పుకోక పోవడంతో మమత(19) మన స్థాపం చెంది ఇంట్లో రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి తల్లి తండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.