Telugu News

=సాగర్ కాలువలో పడి దంపతులు మృతి

== ముత్తగూడెం సాగర్ కాలువ గేటు వద్ద భార్య మృతదే

0

===సాగర్ కాలువలో పడి దంపతులు మృతి
== ముత్తగూడెం సాగర్ కాలువ గేటు వద్ద భార్య మృతదేహం
== ఇంకా లభించని భర్త ఆచూకి
== కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
==(ఖమ్మంరూరల్,కూసుమంచి-విజయంన్యూస్);-
నాగార్జున సాగర్ కాలువలో పడి దంపతులుకాలువలో పడిపోయిన సంఘటన శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం ఆరెకొడు గ్రామానికి చెందిన ఆరెంపుల నందిని(23),ఆమె భర్త పరుశరాం(27) శుక్రవారం ఉదయం రూరల్ మండలం ముత్తగూడెం దగ్గర సాగర్ కాలవలో భర్త భార్యలు ఇద్దరు కాలువలో పడిపోయారు. దీంతో స్థానికులు అచూకి కోసం గాలించిన ఫలితం లేకపోయింది.

also read :-***పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల కోసం గజఈతగాళ్లతో గాలించారు. అయితే భార్య నందిని మృతదేహం పల్లె గూడెం లాకుల వద్ద లభ్యమైనట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అన్నం ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వగా ఖమ్మం నుండి మృతదేహం వద్దకు చేరుకున్న అన్నం పౌండేషన్ మృతదేహాన్ని పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించడం జరిగింది. భర్త మృత దేహం లభ్యం కాలేదు. గజఈతగాళ్లు గాలింపు చేపడుతున్నారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.