Telugu News

***ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం

మంత్రి అజయ్ కుమార్ తీవ్ర సంతాపం

0

***ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం

***మంత్రి అజయ్ కుమార్ తీవ్ర సంతాపం

***(విజయం న్యూస్):-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(49) హాఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణ వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, తను మంచి మిత్రుడిని కోల్పోయానని మంత్రి అజయ్ పేర్కొన్నారు.

also read :-*బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ..

పారిశ్రామిక‌వేత్త‌, రాజ‌కీయ‌వేత్త‌గా గౌతమ్ రెడ్డి సేవలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.