Telugu News

ఖమ్మం రూరల్ మండలంలో మహిళ హత్య..

మేకల దొంగతనం గురించి హత్య చేసిన దుండగుడు

0

ఖమ్మం రూరల్ మండలంలో మహిళ హత్య..

* *మేకల దొంగతనం గురించి హత్య చేసిన దుండగుడు

* *పట్టుకుని దేహశుద్ది చేసిన స్థానికులు

* *పోలీసులు అదుపులో దుండగుడు

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్) ;-

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డులో దారుణం జరిగింది.. మేకలను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని వృద్దురాలు అడ్డుకోవడంతో హత్యచేశాడు..ఆమె అరుపులతో స్థానికులు మెల్కొని దుండగుడికి దేహశుద్ది చేశారు.. తీవ్రంగా గాయపడీన వృద్దురాలు అక్కడికక్కడే చనీపోయీంది. ఈ విషాద సంఘటన కోదాడక్రాస్ రోడ్ లు చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

also read :-బయ్యారంలో భగ్గుమన్న ఉక్కు దీక్ష…!

ఖమ్మం జిల్లా రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన జాన్ బీ(70) అనే వృద్ధురాలు గుడిసె వేసుకొని నివాసం ఉంటుంది . ఆమె మేకలు కాసుకొని జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ వ్యక్తి మేకల దొంగతనానికి పాల్పడగా అది చూసిన జాన్ బీ ఆయనను ప్రతి గటించే ప్రయత్నం లో చాకు తో ఆమె పై హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇది గమనించిన చుట్టూ పక్కల వాళ్లు ఆ వ్యక్తి ని పట్టుకోని దేవశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు