కూసుమంచి మండలాన్ని వణికిస్తున్న కరోనా
మండల పరిషత్ కార్యాలయంలో16మందికి కరోనా
ఎంపీడీవో, సూపరింటెండెంట్, టైపిస్ట్ తో పాటు పంచాయతీ కార్యదర్శులకు కరోనా
(కూసుమంచి-విజయంన్యూస్)
కరోనా మహమ్మారి కూసుమంచి మండలాన్ని వణికిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వెంటపడుతోంది.. ఇప్పటికే బ్యాంక్ ఉద్యోగుల వెంటపడుతున్న కరోనా ఇప్పుడూ ప్రభుత్వ కార్యాలయాలపై పడింది. ఇప్పటికే కూసుమంచి వ్యవసాయశాఖలో కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో చొరబడింది. బుధవారం కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు పంచాయతీ కార్యాదర్శులకు కరోనా వైరస్ సోకగా,ఇప్పుడు ఎంపీడీవో,సూపరింటెండెంట్, టైపిస్ట్ లతో మరికొంత మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. కూసుమంచి వ్యవసాయశాఖశాఖ కార్యాలయంలో నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్ రాగా, ఇప్పుడు కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో మొత్తం 16మందికి కరోనా వచ్చినట్లు సమాచారం. దీంతో సమాచారం తెలుసుకున్న తోటి ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం కలిసి ఉండే వారికి కరోనా రావడంతో ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు టెస్టులు చేసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు.
also read :-శిథిలావస్థ భవనాలకు నోటీసులు జారీ చేయాలి
వారితో తిరిగిన వారు, మాట్లాడిన తోటి ఉద్యోగులు టెస్టులు చేయించుకుంటున్నారు. కాగా కూసుమంచి మండలంలో ఇంత పెద్ద మొత్తంల కరోనా కేసులు రావడంతో ఉద్యోగులు, ప్రజలందరు భయాందోళన చెందుతున్నారు.పంచాయతీ కార్యదర్శులకు కరోనా రావడంతో సర్పంచులు, సిబ్బంది భయపడుతున్నారూ. ఇక సర్పుచులు.. సిబ్బంది ప్రజల్లో తిరుగుతారు కాబట్టి ఇంకా ఎంత మందికి కరోనా వచ్చిందేమోనని భయపడుతున్నారు. మొత్తానికి కూసుమంచి మండలంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా కేసులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.