ఆస్ట్రేలియా లో లక్షెట్టిపెట్ యువకుడు మృతి
సిడ్నీ ప్రాంతం పరిధిలోని క్యూలైన్ ప్రదేశం వద్ద రోడ్డు ప్రమాదం◆
ఆస్ట్రేలియా లో లక్షెట్టిపెట్ యువకుడు మృతి
◆సిడ్నీ ప్రాంతం పరిధిలోని క్యూలైన్ ప్రదేశం వద్ద రోడ్డు ప్రమాదం◆
◆కారు అదుపుతప్పి చెట్టుకు డీ◆
◆కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం సభ్యులు◆
(లక్షెట్టిపెట్:విజయం న్యూస్);-
లక్షెట్టిపెట్ పట్టణానికి చెందిన చీకటి కొమురయ్య కమల కుమారుడు చీకటి రాజు ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ ప్రాంత పరిధి క్యూలైన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ 10వ వార్డు కి చెందిన చీకటి కొమురయ్య కమలకి ఇద్దరు కొడుకులు ఒక్క కుమార్తె ఉంది కుమార్తెకు వివాహం జరగగా పెద్ద కుమారుడు చీకటి రాజు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నతమైన చదువులు చదివి ఉదోగ్యం సంపాదించుకున్నాడు.
also read :-సాంబార్ లో పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి
చిన్న కుమారుడు సాయికిరణ్ ఎంబీఎ చదువుతున్నాడు.రాజు ఇంటర్మీడియట్ వరకు పట్టణంలోని చదువుకొని హైదరాబాద్ లో బిటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు.గత రెండు సంవత్సరాల్లో తన చదువుని పూర్తి చేసుకొని ఆస్ట్రేలియా లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉదోగ్యం సంపాదించి విధులు నిర్వహిస్తున్నాడు.ఆదివారం రాత్రి తన స్నేహితులతో కలిసి కారులో ఇతర ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిడ్నీ ప్రాంతంలోని క్యూలైన్ ప్రదేశం వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు డీ కొట్టడంతో రాజు మృతిచెందాడు.ప్రభుత్వ అధికారులు మృతుదేహాన్ని స్వదేశానికి త్వరగా తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.