నాకు న్యాయం చేయాలి
*భూమి కభ్జా ప్రయత్నం. అడ్డుకున్న కుమారులు
(విజయం న్యూస్ ఖమ్మం):-
చింతకాని 17.మండల పరిధిలోని వందనం గ్రామంలో రఘునాధపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తేజావత్ ధానికి వందనం గ్రామ రెవిన్యూ లోసర్వే నెంబర్ 117 అ 3 నందు 4 ఎకరముల భూమి ఉన్నది. ఆ భూమి ధాని పేరు మీద ఖాతా నెంబర్ 600 81 18 ,నోట్, T26020010801 ద్వారా పట్టాదారు పాస్ పుస్తకము తో ఉన్నది. ఆ భూమిని గతంలో ఎవరికీ అమ్మకాలు జరిపిఉండలేదని,14 వ తేదిన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బాణోత్
also read;-కందాల సహకారం తో శీనన్న ఫైట్.
రవికిరణ్ నా భూమి నందు ప్రవేశించి తనకు 0.6 కుంటలు రిజిస్ట్రేషన్ ఉన్నదని, తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా కొందరు వ్యక్తులతో కలిసి నా భూమి నందు ప్రవేశించి ఫెన్సింగ్ లైన్ వేయటానికి ప్రయత్నించగా నా కుమారులు అడ్డుకోవడం జరిగిందని, దయవుంచి పై విషయమును తమరు పరిశీలించి నా వద్ద వుండ బడిన ఆధారములు ద్వారా నాకు తగు న్యాయం చేయాలని చింతకాని డిప్యూటీ తాసిల్దార్ అరుణ రెడ్డి కి ఆమె కుమారుల ద్వారా వినతి పత్రం అందజేశారు.