Telugu News

ములుగు జిల్లాలో కిడ్నాఫ్ కలకలం.. ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..?

హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని కోరుతున్న భార్యపిల్లలు

0

ములుగు జిల్లాలో కిడ్నాఫ్ కలకలం.. ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..?

** హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని కోరుతున్న భార్యపిల్లలు

(వెంకటాపురం-విజయంన్యూస్)

ములుగు జిల్లాలో కిడ్నాఫ్ వార్త కలకలం రేపింది.. మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు కిడ్నాఫ్ చేసినట్లు తెలుస్తోంది.. సోమవారం సాయంత్రం  ఆయన్ను కిడ్నాప్ చేసి అడువులోకి తీసుకెళ్లినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం, వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోరసం రమేష్ ను మావోయిస్టులు కిడ్నాఫ్ చేసినట్లు సమాచారం. సోమవారం చర్ల మండలంకు ఇతర పనుల నిమిత్తం వెళ్తుండగా మాపుకాచిన మావోయిస్టులు రమేష్ ను కిడ్నాఫ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో  స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. రమేష్ చాలా మంచి వాడని, ఎవరికి ఎలాంటి తలపెట్టే వ్యక్తి కాదని, ఆయన్ను మావోయిస్టులు క్షమించి ఎలాంటి తలపెట్టకుండా వదిలిపెట్టాలని భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎందుకు కిడ్నాఫ్ చేయాల్సి వచ్చిందో మాకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ మేరకు ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు స్పందించి అప్రమత్తమైయ్యారు.  ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

allso read :- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి…