Telugu News

సెల్ ఫోన్ కోసం భార్యను అమ్మేసిన భర్త

రూ.1.08లక్షలకు భార్యనమ్మి స్మార్ట్ పోన్ కొనుగోలు

0

సెల్ ఫోన్ కోసం భార్యను అమ్మేసిన భర్త

— రూ.1.08లక్షలకు భార్యనమ్మి స్మార్ట్ పోన్ కొనుగోలు

— ఒడిశాలో దారుణం.. 

(హైదరాబాద్-విజయంన్యూస్)

స్మార్ట్ ఫోన్ కోసం ఏకంగా భార్యనే మరోకరికి అమ్మెసిన వింత సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.. రూ.1.08లక్షలకు భార్యను అమ్మిన భర్త స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నాడు.. సమాచారం అందుకున్న ఆయన మామయ్యలు(పోలీసులు) స్మార్ట్ ఫోన్ ను పోలీస్ స్టేషన్లోని బిరువాలో భ్రదంగా దాచి భర్తను జైలుకు పంపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త లక్షరూపాయలకు తన భార్యను అమ్మి స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. బలంగీర్ జిల్లాలోని బెల్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు 26 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న నెలకాక ముందే పని కోసం రాజస్థాన్ బారన్ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇటుక బట్టీ పనులు చేస్తుండేవాడు. అయితే 55 ఏళ్ల బట్టీ యజమానికి లక్షా 8 వేల రూపాయలకు తన భార్యను అమ్మేశాడు. ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొనుక్కుని మళ్లీ ఒడిశా వెళ్లిపోయాడు.

భార్య ఏద ఇంట్లో వాళ్లు అడగగా ఎవరితోనే వెళ్లిపోయిందని అబద్ధం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్తో పోలీసులు ఆ యువకుడి స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆమెను అమ్మేసినట్టు రికార్డింగులు ఉన్నాయి. దాంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా వివరాలన్ని చెప్పేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని ఆ యువకుడిని జైలుకు తరలించారు.

ALSO READ :- రోడ్డు ప్రమాదంలో ఒకే ఇంటికి చెందిన ముగ్గురు మృతి

‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’