Telugu News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.

-మరోకరి పరిస్థిథి విషమం.

0

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.

-మరోకరి పరిస్థిథి విషమం.

-రోడ్డు ప్రమాదం జరిగి మూడు రోజులకు వెలుగుచూసిన ఘటన.

( జైనూర్ విజయం న్యూస్) : –

రోడ్డు ప్రమాదంలో జైనూర్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా , మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది . రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజుల తరువాత ఘటన వెలుగు చూసింది . కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం … మండల కేంద్రంలోని కాలేజిగూడాకు చెందిన అహ్మద్ , వీకర్ సెక్షన్ కాలనికు చెందిన షేక్ ఫరీద్ ( 50 ) గత మూడు నెలలుగా తిర్యాణి మండలంలో మేస్రిపని చేస్తున్నారు . 15 రోజుల క్రితం వీరు పనికి వెళ్లగా తిర్యాణి మండలంలోని అడవుల్లో రోడ్డు ప్రమాదం జరిగి షేక్ ఫరీద్ ( 50 ) మృతి చెందాడు . అదేవిధంగా అహ్మద్ తీవ్రగాయాలతో ఉన్నాడు .

also read;-— జోరుగా మాస్ కాపీయింగ్

ఈ ఘటన గత మూడు రోజుల క్రితం చోటు చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు . జైనూర్కు చెందిన ఓ వ్యక్తి ఆసిఫాబాద్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వీరిని తిర్యాణి మండల వాసులు ఆసుపత్రికి తరలించడంతో జైనూర్కు చెందిన వ్యక్తి శవాన్ని గుర్తు పట్టాడు . ఇలా ఈ ఘటన వెలుగు చూసింది . గాయాల పాలైన అహ్మద్ గాయాల్లో , శరీర అవయవాల్లో చీమలు పట్టాయని అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువు రోధిస్తు తెలిపారు . పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.