Telugu News

సోమగూడెం లో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

0

సోమగూడెం లో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుకనుండి ఢీకొట్టడంతో లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా గోపనపల్లి సంతోష్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సంతోష్ ని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని కాసిపేట ఎస్ఐ నరేష్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల డిపోకు చెందిన AP01Z 0044 ఆర్టీసీ బస్సు మంచిర్యాల నుండి కాగజ్నగర్ వైపు వెళ్తుండగా ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారులు కూడా మంచిర్యాల నుండి కాగజ్నగర్ వైపు వెళ్తున్నట్లు సమాచారం, ఈ ప్రమాదం ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని స్థానికులు తెలిపారు.

also read ;- జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం.