మ్యాచ్ లో గాయపడ్డ రోహిత్‌శర్మ
== ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న రోహిత్
== అనంతరం ఏం జరిగిందంటే..?
(డాకా నుంచి క్రీడావిభాగం-విజయంన్యూస్):
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అడుతుండగానే తీవ్రంగా గాయపడ్డాడు.బుధవారం డాకాలో బంగ్లాదేశ్ తో భారత్ అడుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో భారత్ బోలర్ సిరాజ్ వేసిన రెండవ ఓవర్ లో క్చాచ్ పట్టేందుకు ప్రయత్నం చేసి గాయపడ్డాడు. దీంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఆయన చేతికి మాత్రమే గాయమైంది..
ఇది కూడా చదవండి: బంగ్లాపై టీమిండియా ఘోర పరాజయం
పూర్తి వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ క్రికెట్ వన్డే టోర్నమెంట్ డాకాలో జరుగుతుంది. రెండవ వన్డే జరుగుతుండగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ టీమ్ కు రెండవ ఓవర్ లో సిరాజ్ బోలింగ్ చేస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. సిరాజ్ వేసిన బంతిని బ్యాట్స్ మెన్ స్లిప్ప్ లో కట్ చేసే ప్రయత్నం చేయగా రెండవ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రోహిత్ శర్మ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. రోహిత్‌ను పరీక్షించిన బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని వైద్య పరీక్షల కోసం ఢాకాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ‘కెప్టెన్ రోహిత్ బొటన వేలికి గాయమైంది. స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. బీసీసీఐ వైద్య సిబ్బంది అతడి పరిస్థితిని అంచనా వేస్తోంది’ అని రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. దీంతో రోహిత్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగానే ఉందని అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ తదుపరి బ్యాటింగ్ కు రావడం గమనర్హం. అయినప్పటికి టీమిండియా ఓటమి చవిచూసింది.
ఇది కూడా చదవండి: హోంగార్డుల సేవలు అనిర్వచనీయం :పోలీస్ కమిషనర్