Telugu News

చినజీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఆదివాసీ నాయకుల డిమాండ్

0

చినజీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఆదివాసీ నాయకుల డిమాండ్
(వాజేడు  విజయం న్యూస్):-
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్ స్వామి పై వెంటనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ నాయకుడు దబ్బకట్ల లక్ష్మయ్య అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు మండల కేంద్రంలో చిన్నజీయర్ స్వామి చిత్రపటానికి చెప్పుల మాలలు వేసి, డప్పు వాయిద్యాలతో ఊరేగించి, దిష్టిబొమ్మ దహనం చేశారు.

also read;-చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బోదేబోయిన సురేష్, కృష్ణ బాబు, ప్రసాద్,అదినారాయణ, సతీష్, ఆదివాసి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.