Telugu News

అత్తంటి ఎదుట కోడలు మౌన పోరాటం.

భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం చేసిన సంఘటన గార్ల మండల కేంద్రంలోని స్థానిక పుట్టకోట్ట బజారులో బుధవారం చోటుచేసుకుంది

0

అత్తంటి ఎదుట కోడలు మౌన పోరాటం

(గార్ల-విజయం న్యూస్) :- 

భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం చేసిన సంఘటన గార్ల మండల కేంద్రంలోని స్థానిక పుట్టకోట్ట బజారులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే. పుట్టకోట బజారుకు చెందిన ఎస్ కే సైదులుకు చీమల పాడు గ్రామానికి చెందిన ఎస్ కే హూజీనా తో ఐదేళ్ల క్రింతం వివాహం జరిగింది.

నాలుగు సంవత్సరాలు కాపురం సజావుగా సాగింది ఒక సంవత్సరం కాలం నుండి నా భార్త సరిగా ఉండటంలేదని తరచుగా గొడవలు పెట్టుకుంటూ నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడని హుజీనా వాపోయింది. నా భర్త నాతో సరిగా ఉండకుండా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దీంతో నన్ను నా కుటుంబ సభ్యులను తరచుగా అసభ్య పదజాలంతో తిడుతూ వేధిస్తున్నాడని నా అత్త మామ. నా భర్త సైదులు . తమ్ముడు, చెల్లలు చెప్పిన మాటలు విని నన్ను వేధింపులకు గురి చేయడంతో దీంతో నేను నా తల్లిగారి ఇళ్లలైన చీమల పాడుకు వెళ్లానని.నాకు న్యాయం కావాలని కారేపల్లి పోలీసు స్టేషన్ లోఫిర్యాదు చేశానని

కానీ కారేపల్లి పోలీసు స్టేషన్ లో కూడా నాకు న్యాయం జరగలేదని హూజీనా ఆవేదన వ్యక్తం చేసింది . హూజీనా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సహ భర్త సైదులు ఇంటి ముందు గత మూడు రోజుల నుండి మౌన పోరాటం చేస్తూ నా భర్త నాకు కావాలని నాకు న్యాయం జరగాలని మౌన దీక్ష చేసింది దీంతో భర్త ఎస్ కే, సైదులు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు నా భర్త నాకు కావాలని నాకు న్యాయం జరిగే వరకు ఈ మౌన దీక్ష ఆపనని తెలిపింది.

also read :- కారు ఢీకొని వికలాంగుడు మృతి.