Telugu News

దక్షణాప్రిక పై భారత్ ఘనవిజయం

8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా

0

దక్షణాప్రిక పై భారత్ ఘనవిజయం

== 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా

== సూర్యకుమార్, కెఎల్ రాహుల్ అర్థసెంచరీలు

== బౌలింగ్ లో సత్తాచాటిన భారత్

==  మూడు మ్యాచ్ ల ఈ టోర్నిలో 1-0తో ముందుంజ

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

భారత్ టీమ్ సూపర్ విక్టరీ సాధించింది.. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో టీమీండియా దక్షణాప్రిక పై ఘన విజయం సాధించింది.. టీమిండియా బౌలింగ్ చేజింగ్ లో దక్షణాప్రిక తడబడింది. దీంతో 8 వికేట్ల తేడాతో ఓటమిపాలైంది.. గ్రీన్ ఫీల్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత్ 1-0 విజయంతో టీమిండియా ముందంజలో ఉంది.

allso read- ఏఐసీసీ లో రాజస్తాన్ రగడ

పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న టీమిండియా   మొదటిలోనే తమ సత్తా చాటింది. విషయంలో కొంత తడబడిందనే చెప్పాలి. మొదటిగా బ్యాటింగ్ చేసిన దక్షణాఫ్రిక నిర్ణేత 20ఓవర్లకు గాను ఎనిమిది వికేట్ల నష్టానికి 106 పరుగులు చేయగా, ఆ టీమ్ లో కేశవ్ మహారాజ్ 41(35బంతుల్లో), మార్ఖరమ్ 25(24బంతుల్లో), పరినేల్ 24(37బంతుల్లో) మంచి స్కోర్ చేశారు.  భారత్ బోలర్ల సౌత్ ఆఫ్రిక బ్యాట్స్ మెన్ లను ఆడేసుకున్నారు..  టీమీండియా బోలర్ అర్షదిప్ మొదటి ఓవర్ లోనే మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. మొదటి పరుగుకే వికెట్ నష్టపోయిన సౌత్ ఆఫ్రిక, 2వ రన్ కు మరో వికెట్, మూడవ రన్ కు మరో వికెట్ అలా 9 రన్స్ కే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. పై ముగ్గురు మినహా దక్షణాఫ్రిక టీమ్ లో ఎవరు రెండు అంకెల సంఖ్య బ్యాటింగ్ చేయలేదు. ఇక అర్షదీప్ 3, దీపక్ చహేర్ 2, హర్షల్  పటేల్ రెండు వికెట్లు తీసుకున్నారు.

allso read- ఆస్ట్రేలియా పై భారత్ విక్టరీ

== దంచికొట్టిన ఇండియా టీమ్

107 పరుగల లక్ష్యంగా క్రిజ్ లోకి వచ్చిన టీమిండియా ప్రారంభంలోనే రోహిత్ శర్మ, కోహ్లీ వికెట్ల ను నష్టపోయింది..దీంతో ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్,  సెకండ్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటిలో కొంత తడబడినప్పటికి వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు.  ఆ తరువాత రెచ్చిపోయిన సూర్యకుమార్, రాహుల్ బంతి పై తమ ప్రతాపం చూపించారు. సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ ఇద్దరు పోటీ పడి మరీ అర్థ సెంచరీలు చేశారు. సూర్యకుమార్  యాదవ్ 33బంతుల్లో 50 పరుగులతో వీర విహారం చేశాడు. ఆయనకు తోడుగా  కెఎల్ రాహుల్ 56బంతుల్లో 51పరుగులు చేసి ఇద్దరు ఆఫ్ సెంచరీలు చేశారు. చివరి వరకు క్రిజ్ లో పాతుకపోయిన వారిద్దరు ఇండియాను విజయతీరానికి చేర్చారు. దీంతో 8 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20 టోర్నిలో 1-0 తో ముందంజలో భారత్ టీమ్ ఉంది.