Telugu News

ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు అరెస్టు

0

ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు అరెస్టు

** వివరాలు వెల్లడించిన సుకుమా జిల్లా ఎస్పీ 

(చర్ల,ఖమ్మం ప్రతినిధి -విజయంన్యూస్)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో 8 మంది కీలక మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్‌పల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల సందర్భంగా భద్రతా బలగాలు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరంతా పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అంగీకరించడంతో అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్లు
పోలీసులు, సుకుమా జిల్లా ఎస్పీ  తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అరెస్టు చేసిన మావోయిస్టుల వివరాలు చెబుతున్న పోలీసులు

allso read :- చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టు మృతి

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*