Telugu News

హత్యకు దారి తీసిన భార్యపై అనుమానం*

సినిమాను తలపించే విధంగా  శవాన్ని మాయం చేసే ప్రయత్నం .

0

హత్యకు దారి తీసిన భార్యపై అనుమానం*

సినిమాను తలపించే విధంగా  శవాన్ని మాయం చేసే ప్రయత్నం .

చాకచక్యంగా వ్యహరించి త్వరితగతిన కేసును ఛేదించిన NTPC పోలీసులు

 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపెల్లి జిల్లా ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది .

నిందితుల వివరాలు

A1 పొయ్యిల రాజు s/o. రాజమల్లు, age : 28 yrs, కులం: మాదిగ, r/o . Qr .N . A 1/90 TTS NTPC.

A2. కాంపెల్లి హేమలత w /o . శంకర్, age : 31 yrs, మాదిగ, r/o. ఖాజీపల్లి NTPC

నిందుతుల నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు:

1.మృతుడి యొక్క మోటార్ సైకిల్ : Red colour Passion Pro Bearing TS02-EJ-0804.’

2.నిందితుని మోటార్ సైకిల్ Hero Splendor Plus Black colour bearing N. AP-15-AT- 8968

3.నిందుతుడి మొబైల్ సెల్ పోన్  Tecno Spark బ్లాక్ & వైట్ కలరు 

4.హత్య చేయుటకు ఉపయోగించిన రెండు పదునైన కత్తులు

5.మృతుని తలపై పగిలిన బీర్ సీసా ముక్కలు

 

 

వివరాల్లోకి వెళ్ళితే :

తేదీ: 26-11-2021 సాయంత్రం రోజున ఖాజిపల్లికి చెందిన కాంపెల్లి పోచమ్మ w/o. రాజ మల్లయ్య, age : 54 yrs, caste: మాదిగ, r/o, ఖాజిపల్లి, ఏన్టీపీసీ

తన యొక్క కొడుకు అయిన శంకర్ కనబడుట లేదనే పిర్యాదు మేరకు NTPC పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రాంభించగా! తేదీ: 27-11-2021 రోజున కాంపెల్లి పోచమ్మ తన యొక్క కొడుకు అయినా కామేపల్లి శంకర్ యొక్క తల, ఒక చెయ్యి ఏన్టీపీసీ కూలింగ్ టవర్స్ వెనుకాల రోడ్డుకి ఎడమ వైపు పడి ఉన్నాయనే సమాచారం మేరకు ఏన్టీపీసీ పోలీసులు అట్టి ప్రదేశానికి వెళ్లి, అట్టి తలను, ఎడమ చెయ్యిని శవ పంచనామా నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకొని పిర్యాదు వాంగ్మూలం నమోదు చేసుకొని మిస్సింగ్ కేసును హత్య నేరంగా మార్పు చేసి హేమలత అను ఆమె రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది అనే అనుమానంతో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న పొయ్యిల రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మమ్మరం చేసినారు.

👉నిందితుల గాలింపు చర్యల్లో బాగంగా, నిందితున్ని అనగా! పొయిల రాజు కరీంనగర్ కు పారిపోతుండగా! తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ చౌరస్తా వద్ద  తన బైకుపై ఏన్టీపీసీ పోలీసులు పట్టుకొని పంచులు సమక్షములో  విచారించంగా నేరం ఒప్పుకునే నేరం కు సంబంధించిన వివరాలు తెలియజేసినారు.

👉నిందితుడైన పొయ్యిల రాజు తన చిన్న వయస్సులోనే తల్లితండులను కోల్పోయినాడు. 10 వ తరగతి వరకే చదివి ప్రస్తుతం తన అమ్మ యొక్క ఉద్యోగం అయినా స్వీపర్ ధనవంతిరి ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. 2014 సంవత్సరంలో అతడు కుందనపల్లి కి చెందిన సంధ్య రాణి అను ఆమెను పెళ్లి చేసుకొని అతని వింత ప్రవర్తన వలన 2016 సంవత్సరంలో భార్య విడాకులు యిచ్చి వదిలీ వెయ్యగా! నిందితుడు రాజు TTS NTPC లోని Qr. N0. A1/90 లో ఉంటూ స్వీపర్ గా ఉద్యోగం చేసుకుంటున్నాడు,

👉 ఈ క్రమములో అదే హాస్పిటల్ లో స్టాప్ నర్సుగా పని చేస్తున్న మృతుని భార్య అయిన కాంపల్లి హేమలత తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు అనే అనుమానంతో ఈ వివాహేతర సంబధం గురించి మృతునికి తెలియటం తో తరుచు వాళ్ళ భార్య భర్తల ఇద్దరి మధ్య గొడవలు పడుతూ హేమ లతను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా, వేధిస్తూ ఉండేవాడు.

👉 భర్త చేసే వేధింపులు ధనవంతిరి హాస్పిటల్ లో పనిచేస్తున్నప్పుడు తరుచుగా నిందుతుడు పొయిల రాజుకు చెప్పుకొని బాధపడగా దానికి రాజు మన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్న కాంపెల్లి శంకర్ ను ఎలాగైనా చంపేసి వాళ్లిదరు కలిసి సంతోషంగా జీవించాలని పథకం వేసుకున్నారు.

👉వారి పధకంలో భాగంగా నిందుతుడు రాజు ఏన్టీపీసీ లోని ఆదివారం మార్కెట్లో రెండు  పదునైన పెద్ద కత్తులను కొని తన ఇంట్లో దాచి పెట్టుకొని సమయం కోసం ఎదురుచూస్తుండగా తేదీ: 25-11-2021 రోజున రాత్రి అందాజ 10:30 గంటల సమయంలో నిందుతుడు రాజుకి ఫోన్ చేసి, నీ వల్లనే మా కుటుంబంలో గొడవలు జరుగుచున్నాయి అనగా అప్పుడు నిందుతుడు ఇదే అదునుగా భావించి తెలివిగా మృతుడు శంకర్ ను తన ఇంటికి రప్పించి తన ఇంట్లోని బెడ్ రూములో కూర్చో పెట్టుకొని మభ్య పెట్టి మద్యం తాగించి. సుమారు రాత్రి అందాజా 11:00 గంటల సమయంలో ముందుగా తాను అనుకున్న పథకం ప్రకారం ఖాళీ భీరు సీసాతో మృతుడు శంకర్ తలపై బలంగా కొట్టగా  అతను సృహ కోల్పోయినాడు.

👉తర్వాత నిందితుడు చంపటానికి తెచ్చుకున్న ఆ రెండు కత్తులతో విచక్షణ రహితంగా మృతుని తల, మెడ పై నరకగా మృతుడు అక్కడిక్కడే చనిపయినాడు.

👉 గతంలో  డిటెక్టివ్ మరియు నా పేరు శివ సినిమాల్లో చూసిన విధముగా సాక్ష్యధారలను మాయం చేసి కేసు నుండి తప్పించుకోవాలని మృతుని శరీరాన్ని 7 భాగాలుగా తల, రెండు చేతులు, రెండు కాళ్లు, నడుము పై భాగం చేసి పెద్దపల్లికి వెళ్లే దారిలో తల, చేతులు, కాళ్ళు మరియు మృతిని బండి నెంబర్ Red colour Passion Pro Bearing TS02-EJ-0804  దాచాడు.

👉 మిగిలిన రెండు శరీర భాగాలను ఒక దాన్ని సప్తగిరి కాలనిలోని RTC క్వార్ట్రర్స్ సమీపంలో, ఇంకొక దాన్ని OCP-IV లోని మేడిపల్లి స్మశాన వాటికలో దగ్గర్లో పడవేసినాడు.

👉నిందితుడు మృతున్ని చంపిన విషయాన్నీ తేదీ: 26-11-2021 రోజున ఉదయం 7 గంటలకు హేమలతను ధనమంత్రి హాస్పిటల్ బయట కల్సి వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం చంపివేశానని ఆమెకి తెలియజేసినాడు. 👉ఆ తర్వాత నిందుతుడు రాజునూ న్టీపీసీ పొలిసు వారి ఆధీనములోకి తీసుకొని నిందుతురాలైన కాంపెల్లి హేమలత కోసం గాలింపు చర్యలు మమ్మరం చెయ్యగా ఈ క్రమములోనే తేదీ: 27-11-2021 రోజున రాత్రి 9:00 గంటలకు నిందితురాలు కాంపెల్లి హేమలతను ఏన్టీపీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డీసీపీ పెద్దపల్లి, ఏసీపీ గోదావరిఖని పర్యవెక్షణలో హత్యా కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన CI రామగుండం, CI రవీందర్, SI NTPC, SI అంతర్గం, SI రామగుండం PSI s మహేష్, రాజశేఖర్, శరణ్యాలు మరియు సిబ్బంది సుమన్, మల్లికార్జున్, తదితరులను CP గారు ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డు అందిచటం జరిగింది

 

ఈ పత్రిక సమావేశంలో CP రామగుండము గారితో పాటుగా, DCP పెద్దపల్లి గారు, ACP పెద్దపల్లి, CI రామగుండము, ఇన్స్పెక్టర్ రవీందర్, SIs, స్వరూప్ రాజ్, శ్రీధర్, శైలజ, PSIs లు మహేష్, రాజశేఖర్, శరణ్యాలు పాల్గొన్నారు.

also read :- సర్జికల్‌ బ్లేడుతో శరీరం తునాతునకలు.