బంగ్లాపై భారత్ ఘనవిజయం
== 5 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
== చివరి బంతి వరకు ఉత్కంఠగా మారిన మ్యాచ్
(క్రీడా విభాగం-విజయంన్యూస్)
టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం బంగ్లాదేశ్ పై భారత్ ఘనవిజయం సాధించింది.. 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత్, సెమిస్ ఆశలను సజీవం చేసుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ గ్రూపు బీలో బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది. మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట పిల్డింగ్ ను వెంచుకుంది. కాగా బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కొంత సమన్వయంతో అడినట్లు కనిపించినప్పటికి రోహిత్ శర్మ ఆవుట్ అవడంతో మొదటి వికెట్ ను కోల్పోయింది.
allso read- బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే..?: రాహుల్ గాంధీ
ఆ తరువాత మూడవ బ్యాట్సమెన్ గా వచ్చిన కోహ్లి 64(44బంతుల్లో) కెఎల్ రాహుల్ 50(32 బంతుల్లో) అద్భుత భాగస్వామ్యంతో భారత్ కు మంచి స్కోర్ ను అందించారు. అ తరువాత సూర్యకుమార్ యాదవ్30(16), ఆర్.అశ్విన్ 13(6బంతుల్లో) రాణించడంతో భారత్ 20 ఓవర్లకు గాను 184 పరుగులు చేసింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్సిమెన్ భారత్ బోలర్లపై విరుచకపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు లిటన్60(27బంతుల్లో) అద్భుత ఆప్ సెంచరితో రాణించడంతో పాటు షాంతో 21(14బంతుల్లో) సహాకరంతో 10 8 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పోరు. ఒకానోక దశలో ఇండియా ఓటమి ఖాయం అనుకున్న సందర్భంలో వరుణుడు సహాయం చేసినట్లైంది..
== మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన రాహుల్ త్రో
భారత్ బోలర్లపై బంగ్లా బ్యాట్స్ మెన్ తో విరుచుకపడుతున్న సమయంలో వరుణదేవుడు భారత్ ను కాపాడినట్లైంది.. 7ఓవర్ల తరువాత ఉన్నట్లుగా వర్షం రావడంతో కొద్ది సమయం విరామం దొరికింది.. దీంతో పాటు బంగ్లా బ్యాట్స్ మెన్స్ వీరవిహారం చేస్తున్న సమయంలో కెఎల్ రాహుల్ విసిరిన త్రో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అప్పుడు తొలి వికెట్ పడింది. ఆ తరువాత వరసగా వికెట్లు కుప్పకూల్చే పనిలో భారత్ బోలర్లు సక్సెస్ అయ్యారు.
allso read- బొమ్మలో సినీ హీరో అల్లు శిరీష్ సందడి
== చివరి బంతి వరకు ఉత్కంఠ
బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మధ్య నడిచిన టీ20 మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. చివరి బంతి వరకు కొనసాగింది. చివరి ఓవర్లలో 6 బంతులకు 17 కావాల్సి ఉండగా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ 6, 4 తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. దీంతో చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో చివరి బంతిని హర్షదిఫ్ సింగ్ సింగిల్ రన్ ఇవ్వడంతో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ నాలుగు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ లు విజయం సాధించడంతో సెమిస్ అవకాశాలను దక్కించుకుంది.