బంగ్లాపై టీమిండియా ఘోర పరాజయం
== బంగ్లా చేతిలో 5 పరుగుల తేడాతో రెండవ ఓటమి
== చేతులెత్తేసిన భారత బ్యాట్సిమెన్స్
== బంగ్లా ఆల్ రౌండ్ ప్రతిభతో ఘనవిజయం
== 2-0తో సిరీస్ ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్
(ఢాకా- క్రీడా విభాగం-విజయంన్యూస్)
పసికూన బంగ్లాదేశ్ పై భారత్ క్రికెట్ టీమ్ తలవంచారు.. తక్కువ స్కోర్ చేదనలో భారత్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు.. సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగి భారత్ ఓటమికి కారణమైయ్యారు… టీ20 ప్రపంచకప్ తరువాత జరుగుతున్న క్రికెట్ టోర్నిలను భారత్ చేజేతులా వదిలేస్తున్నాయి.. పెలవ బౌలింగ్, మూర్ఖత్వపు బ్యాటింగ్ ఫలితంగా భారత్ సమిష్టి వైఫల్యంతో రెండవ వన్డే కూడా తుడిచిపెట్టుకపోయింది.. ఉత్కఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత జట్టు 5 పరుగుల తే డాతో ఓటమిపాలైంది. సమిష్టి ఆల్ రౌండ్ ప్రతిభతో బంగ్లాదేశ్ విజయంపరపర కొనసాగుతు వస్తోంది..
ఇది కూడా చదవండి: జర్నలిస్టులకు అండగా ఉంటా: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వరసగా రెండు వన్డేలో ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్ ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను2-0తో దక్కించుకుంది. 272 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులే చేయగలిగింది. భారత బ్యాట్స్ మన్ లో శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56) రోహిత్ శర్మ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. రాహుల్, కోహ్లీ, ధావన్ దారుణంగా విఫలమయ్యారు. రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మహ్ముదుల్లా, మెహిదీ హసన్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. మెహిదీ హసన్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. 83 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 8 ఫోర్లతో 100 పరుగులతో సత్తా చాటాడు. మహ్ముదుల్లా 77 పరుగులతో రాణించాడు. ఆరంభంలో అదరగొట్టిన భారత బౌలర్లు ఆరో వికెట్ తర్వాత నుంచి మాత్రం పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచారు. బంగ్లాదేశ్ 69 పరుగులు చేసే సమయానికి 6 వికెట్లను కోల్పోగా.. ఆ తర్వాత ఏడో వికెట్ పడే సమయానికి 217 పరుగులు చేసింది. మహ్ముదుల్లా, మెహిదీ హసన్ కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ జట్టు 150 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని టీమిండియా అభిమానులు భావించారు. కానీ.. బంగ్లా బ్యాటింగ్ అనూహ్యంగా పుంజుకుని 271 పరుగులు చేసి టీమిండియాకు పెద్ద సవాలే విసిరింది.
ఇది కూడా చదవంఢి: హోంగార్డుల సేవలు అనిర్వచనీయం :పోలీస్ కమిషనర్
ఒక్క వికెట్ పడగొట్టడానికి దాదాపు 150 పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డేలో కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న బంగ్లాదేశ్ ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచి సత్తా చాటింది. టీమిండియాకు జీర్ణించుకోలేని ఓటమిని మిగిల్చింది. రెండో వన్డేలో కూడా బంగ్లాదేశ్ ఓపెనర్లు ఫెయిల్ అయినప్పటికీ మిడిలార్డర్ రాణించింది. టీమిండియా తొలి వన్డేలో 186 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 73 పరుగులు సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లకు 37 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 58 పరుగులు ఇచ్చుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే.. టీమిండియా బౌలింగ్ మాత్రం కలవరపెడుతోంది. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారనుకునేలోపే అత్యధికంగా పరుగులు సమర్పించుకున్నారు.