Telugu News

187 పరుగులకే ఆలౌట్ అయిన టీమీండియా

చేతులేత్తేసిన  ఇండియా బ్యాట్స్ మెన్స్

0

187 పరుగులకే ఆలౌట్ అయిన టీమీండియా

==  చేతులేత్తేసిన  ఇండియా బ్యాట్స్ మెన్స్

== బౌలింగ్ సత్తా చూపించిన  షకీబ్, ఇబాదత్ 
== టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

ప్రాంతం మారిన.. ప్రదేశం మారిన.. క్రీడా స్థలం మారిన.. టీమీండియా ఆటగాళ్ల  ఆట తీరు పరిస్థితి మారడం లేదు.. టీ20 ప్రపంచ కప్ టోర్నిలో సెమిఫైనల్ లో పెలవ ప్రదర్శన చూపించిన టీమీండియా బ్యాట్స్ మెన్స్, బౌలర్లు ఆ తరువాత జరిగిన న్యూజలాండ్ తో జరిగిన టోర్నమెంట్ లో అదే ఆటతీరును కనబర్చారు. ప్రస్తుతం పసికూన బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో కూడా అదే పెలవ ప్రదర్శన కనిపిస్తోంది. 50 ఓవర్ల వన్డే మ్యాచ్ లో కేవలం 41.2 ఓవర్లకే అంతా అవుటైన పరిస్థితి కనిపిస్తోంది.  బంగ్లా దేశ్ నుంచి  షకీబ్ కు 5 వికెట్లు, ఇబాదత్ కు 4 వికెట్లు తీసి టీమీండియా బ్యాట్స్ మెన్స్ ను ఓ ఆట అడేసుకున్నారు. పరువుపోతుందనుకున్న సమయంలోనే  73 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ భారత్ టీమ్ ను మంచి స్కోరు వైపు తీసుకొచ్చాడు.   పూర్తి వివరాల్లోకి వెళ్తే భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వన్డె క్రికెట్ టోర్నమెంట్  ఆదివారం ప్రారంభమైంది. టాస్ గెలిసి బ్యాటింగ్ వెంచుకున్న  బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబల్ హసన్ 5 వికెట్లతో టీమిండియా వెన్నువిరిచాడు. మరో ఎండ్ లో ఇబాదత్ హుస్సేన్ 4 వికెట్లతో విజృంభించడంతో భారత్ విలవిల్లాడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలట్ అయింది. కేఎల్ రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (7) విఫలమయ్యాడు. షకీబ్ ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9)లను పెవిలియన్ చేర్చడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. మెహిదీ హసన్ కు ఒక వికెట్ దక్కింది.

ఇది చదవండి: ఖమ్మం ఫారెస్ట్ శాఖకు మరో షాక్