Telugu News

యువతి, యువకులను నగ్నంగా చూసిందని ఘోరం.

రాజస్థాన్లో జరిగిన ఓ సంఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఓ మహిళను కిరాతకంగా చంపి పడేశారు.

0

యువతి, యువకులను నగ్నంగా చూసిందని ఘోరం.

రాజస్థాన్లో జరిగిన ఓ సంఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఓ మహిళను కిరాతకంగా చంపి పడేశారు. న్యూస్ 18 కథనం మేరకు.. రాజస్థాన్లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో నివసించే జీవారామ్(50) అనే రైతు రాత్రి పొలంలో తన భార్య కంకుబాయి(45) కోసం ఎదురు చూస్తుండగా ఆమె భోజనం తీసుకొని ఎంతసేపటికీ రాలేదు. దీంతో కంకుబాయిని వెతుకుతూ జీవారామ్ బయలుదేరాడు.

గ్రామస్తులందరినీ తన భార్య గురించి అడిగాడు. జీవారామ్ తో కలిసి అతని బంధువులు కంకుబాయ్ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె దొరకలేదు. అయితే కంకుబాయి శవం తెల్లవారు ఝామున పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో దొరికింది. ఆమె శవానికి కాళ్లు లేవు. అయితే అడవిలో శవం లభించడం, శవానికి కాళ్లు కూడా లేకపోవడంతో గ్రామస్తులంతా ఇదేదో జంతువు చేసిన పనిగా అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య సమాచారం అందుకున్న పోలీసులు కంకుబాయ్ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

పోలీసులు విచారణలో కొందరు గ్రామస్తులు జీవారామ్ పొలం కంటే ముందుగా వచ్చే పొలం వద్ద ఆ రోజు రాత్రి ఒక యువకుడిని చూసినట్లు చెప్పారు. ఆ యువకుడు పక్క గ్రామంలో నివసించే గోపి అని తెలిసింది. గోపిని అరెస్ట్ చేసిన పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా అతను నిజం ఒప్పుకున్నాడు. కంకుబాయ్ చనిపోయిన రాత్రి తాను జీవారామ్ పొలం సమీపంలోని మరో పొలం వద్ద తన ప్రేయసితో ఉన్నానని, గోపి చెప్పాడు. కంకుబాయ్ ఇద్దరు ప్రేమికులని శృంగారం చేసుకుంటుండగా చూసిందని, ఈ విషయం బయట ఎక్కడా ఆమె చెప్పకముందే ఆమెను చంపాల్సి వచ్చిందని తెలిపాడు. మరి కంకుబాయ్ కాళ్లు ఎందుకు నరికావు? అని పోలీసుల ప్రశ్నించగా కంకుబాయ్ కాళ్లకి పెద్ద పెద్ద కడియాలు, గజ్జెలు తీసుకునేందుకు ఆమె కాళ్లు నరికానని ఒప్పుకున్నాడు. దొంగలు ఈ హత్య చేశారని పోలీసులను నమ్మించడానికే అలా చేశానని తన నేరం ఒప్పుకున్నాడు.

also read :-ఖమ్మం జిల్లాలో భారీగా దరఖాస్తులు…122 దుకాణాలకు 6213 దరాకాస్తులు.