Telugu News

మళ్ళీ వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పై తెగబడుతున్న దొంగలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయం న్యూస్

0

మళ్ళీ వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పై తెగబడుతున్న దొంగలు

**ట్రాన్స్ఫార్మర్ల ని టార్గెట్ గా చేస్తూన్న వైనం – విద్యుత్ శాఖ కు తలనొప్పిగా మారిన తీరు

(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయం న్యూస్):

రైతుల పొలాలల్లో లక్షల రూపాయ ల విలువచేసే ట్రాన్స్ఫార్మర్ల ని విద్యుత్ శాఖ ఏర్పాటు చేస్తే ట్రాన్స్ఫార్మర్లు ఉండే విలువైన కాపర్ వైర్ కోసం దొంగలు వాటినే టార్గెట్ చేస్తున్న తీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట లో తుమ్మల చెరువు ఆయకట్టు శివారు లోని మండ్రు ప్రసాదరైతు పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను దొంగలించారు.రైతులకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడితే విద్యుత్తు అంతరాయం కలగకుండా పొలాలల్లో అక్కడక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసింది

also read :-వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం

ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దు అని రైతులకు ఆదేశాలు ఇవ్వడంతో రైతులు పొలాలలో పంట వేయలేదు రైతులు పొలాల వద్దకు రైతులు వెళ్లకపోవడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ ని దొంగలు దోచుకు వెళ్తున్నారు దయచేసి ట్రాన్స్ఫార్మర్లను దోచుకు వెళ్తున్న దొంగల పై నిఘా పెట్టి వారిని పట్టుకోవాలని తుమ్మల చెరువు ఆయకట్టు రైతులు పోలీసు శాఖను కోరుతున్నారు…